తే. |
శర్వరీచంద్రపరిణయసముచితాంకు
రార్పణక్రియఁ గల[య] వియద్విభాగ
పాలి[క]లఁ దోఁచు క్రొత్త జాజాల మొలక
లనఁగఁ దారక లొండొండ యంకురించె.
| 100
|
చక్రవాకవియోగము
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
కమలకోరకనికాయములఁ [1]జిక్కిన తేఁటి
గమిమ్రోఁత ప్రియుకూఁతగాఁ దలంచు
వికసన్మనోజ్ఞహల్లకరాశిలోఁ దూఱి
దావానలం బని తల్లడిల్లు
హంసఖండితమృణాళాంకూరములు శశి
ప్రతిబింబితము లని పరితపించుఁ
గల్లోలఘట్టనోద్గతఫేనపుంజంబు
ఘనమైన వెన్నెల యని కలంగు
|
|
తే. |
వెదకు నలుదిక్కులును జాల వెచ్చ నూర్చుఁ
దలఁకు [2]బిసినీపలాశమధ్యమునఁ బొరలు
జాలిఁ బడి తూలు దివసావసానవేళ
జడిసి ప్రాణేశుఁ బాసిన చక్రవాకి.
| 101
|
[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-71]
సీ. |
మొగడల బిగి వీడు తొగల నంకూరించుఁ
గ్రొత్తనెత్తావి మూర్కొనుచు నులుకు
నిష్ప్రభంబై నీట నీడఁ దోచిన భాను
బింబమ్ముఁ గని భీతి బీఱువోవు
బాష్పంబు [4]చూడ్కిఁ గప్పఁగఁ గూడియుండియు
వికలకంఠముగ నొండొకటిఁ బిలుచుఁ
గసి గాటు గఱచిన బిసనాళములఁ జంద్ర
కరశంక సంధిల్లి మరలఁ గ్రాయు
|
|
తే. |
నీడలను [5]బుద్ధి నొండొంటిఁ జూడ కవలి
నీడ లొండొంటిగాఁ జూచి కూడ [6]నరుగు
భావివిరహవ్యథాభయభ్రాంతివలనఁ
గోకపరవశమై చక్రవాకయుగము.
| 102
|
- ↑ క.జక్కన
- ↑ క.బసివిపలాశ
- ↑ సుంకసాల
- ↑ క.మాడ్కి
- ↑ క.బుట్టి
- ↑ క.నెదుగు