|
సందేహదాయి యగుచును
గందున నెఱసంజ మింటఁ గానఁగనయ్యెన్.
| 84
|
బొడ్డపాటి పేరయ – శంకరవిజయము
తే. |
రాజురాకకుఁ దారహారములతోడి
యామినీపాత్ర నాడింప నేమి సమయ
నాటకుఁడు దోఁపుదెర వాఱినాఁ డనంగ
సాంధ్యరాగము పశ్చిమాశను దనర్చె.
| 85
|
సాయంసమీరణము
[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-81]
సీ. |
ఇనకరాకులజగజ్జనతాలవృంతంబు
నిద్రాణపద్మినీనిశ్శ్వసితము
కైరవిణీ[2]బోధనారంభజృంభంబు
తిమిరమత్తేభఫూత్కృతినిపాత
మాగచ్ఛదతను[3]ధ్వజాం[4]చలచ్చలనంబు
విరహిణీప్రాణా[భి]విగళనంబు
సాంధ్యరాగసువర్ణచలగరుత్కలనంబు
చక్రవియోగాగ్నిచర్మభస్త్రి
|
|
తే. |
రతిసముత్సుకసువదనారభ్యమాణ
ముఖ్యనేపథ్యవాస్తవామోదముదిత
మధుపమధురారవోద్గీయ[మాన] మగుచు
మెలఁగె నయ్యెడ సాయంసమీరణంబు.
| 86
|
దీపకళికలు
మాదయగారి మల్లన - రాజశేఖరచరిత
తే. |
[5]అపుడు చీఁకటి దిశలెల్ల నాక్రమింప
దీపకళికలు గృహమెల్లఁ దేజరిల్లెఁ
దండ్రి రాజ్యంబు కాళింది తాను బడసి
తత్తనూజులఁ బెంచు విధంబు దోప.
| 87
|
- ↑ సుంకసాల
- ↑ క.బోధకా
- ↑ క.ద్విజాంచల
- ↑ క.చర
- ↑ ఇది ముద్రితరాజశేఖరచరితమునందు ఇట్లు కలదు:
అపుడు చీఁకటి యల్లల నాక్రమించి
పార్థివాగ్రణి యను రామభద్రుమీఁదఁ
బొంచి యమ్ములవాన నిండించె నపుడు
చిత్తసంభవుఁ డల యింద్రజి త్తనంగ.