పుట:ప్రబంధరత్నాకరము.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంది తిమ్మన – పారిజాతము [2-32]

చ.

తనువున [1]నంధకారపుమదం [2]బల మిన్నను భద్రదంతికి
న్మొనసినఁ జింద రేఁగి తపనుండను మావుతుఁ [3]గ్రుంకుమెట్టలో
య నురలవైచినన్ నొగిలి యచ్చట నెత్తురు గ్రక్కెనో యనన్
గనుఁగవ గోరగింపఁ బొడకట్టె సముజ్జ్వలసాంధ్యరాగముల్‌.

79

శ్రీనాథుఁడు – భీమఖండము [2-30]

తే.

సంజకెంపును దిమిరపుంజంపునలుపు
[4]గమిచి బ్రహ్మాండభాండంబు గరము మెఱసెఁ
బరమపరిపాకదశ [5]వృంతబంధ మెడలి
[6]పతనమగు తాటిపంటితోఁ బ్రతిఘటించి.

80

[2-32]

శా.

ఆకాశాంచలవీథుల న్నెగడె సంధ్యారాగ[7]రేఖా[వళుల్]
[8]పాకోన్మిద్రితపారిభద్రకళికాపాండిత్యవైతండికో
త్యేక[9]స్ఫూర్జితచండతాండవరయోద్రేకారభట్యుద్భుట
శ్రీకంఠస్థిరదీర్ఘపాటలజటాశ్రేణిన్ విడంబించుచున్.

81

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [6-107]

క.

సగపాలు సాంధ్యరాగము
నిగిడినఁ గెంజాయఁ దనరి నెఱ చీఁకటిచే
సగపాలు నలుపు నొందుచు
గగనము గురివెందగింజ కైవడిఁ బొల్చెన్.

82

పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [3-149]

మ.

[10]మునిదత్తార్ఘ్యపయః[11]ప్రహారకులిశంబుల్ [12]దాఁకి మందేహదే
హనితాంతస్రుతరక్తధార చెలువంబై పశ్చిమాశాతటిం
గనుపట్టెన్ నెఱసంజ చాయ యనుచున్ గాంక్షించి యచ్చోటికిన్
జను కాకోలకులంబు నా దెసల నోజన్ జీఁకటుల్ గ్రమ్మఁగన్.

83

తులసి బసవయ్య - సావిత్రికథ

క.

మందేహదేహదహనా
మందక్షతజప్రవాహమహనీయనదీ

  1. క.సాంధ్యరాగము
  2. క.బులవిన్నను
  3. క.గ్రుంగఁబెట్టి
  4. క.గలసి
  5. క.వృత
  6. క.ప్రబల
  7. క.శాఖా
  8. క.పాకున్మేడ్రిత
  9. క.స్ఫూర్తిప్రచండ
  10. క.మునిదత్తాఖ్య
  11. క.ప్రపూర
  12. క.కాంతి