సాంధ్యరాగము
భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర
సీ. |
వరుణుని శృంగారవనములో [1]బెగడొందు
పగడంపుఁదీఁగెల ప్రాఁ కనంగ
జరమభూధరముపై సురగాలి నెగయింప
దోతెంచు [జేగురు]ధూళి యనఁగ
నస్తాంబురాశిలో నంతకంతకుఁ గ్రాలు
బాడబానలశిఖాపటల మనఁగ
నినురాక కపరదిగ్వనిత [2]యెత్తించిన
రత్నతోరణవిభారాజి యనఁగ
|
|
తే. |
విరియ నుంకించు [3]చెందొవవిరులయందు
వఱలు ఱేకులకాంతికి వన్నె వెట్టి
రమణ రమణీజనానురాగములతోడ
నిగిడి యెఱసంజ పడమట నివ్వటిల్లె.
| 75
|
[4]శాకల్య అయ్యలార్యుఁడు – యుద్ధకాండము [2637]
చ. |
తరువులయందుఁ బల్లవపదస్థితి నద్రులయందు [5]ధాతుబం
ధురగతి నంగనాజనపృథుస్తనమండలిఁ గుంకుమంబునై
పరఁగుచు [6]సాంధ్యశోణిమవిభాసురమై జలనాథదిక్తట
ద్విరదము కుంభి[7]సంభవనవీనగళ[8]ద్రుధిరంబు నాఁ దగన్.
| 76
|
[9]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-81]
క. |
ఇనుఁ డేగుచుఁ జీఁకటి వెను
కొను శం[కం] గావు వెట్టికొనిపోయిన య
త్యనురక్తికిరణబలమో
యన [10]సంధ్యారాగ మొదవె నపు డపరదిశన్.
| 77
|
తెనాలి రామలింగన్న – హరిలీలావిలాసము
ఉ. |
[11]రాసి సహస్రభానుఫణిరత్నము [12]నెల్లను పోవఁదన్నుచున్
వాసరభోగిఁ గాలఫణివైరి గడున్ వడి నొక్కి [13]నక్కుగాఁ
జేసినఁ గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజృంభణం బనం
గా సముదగ్రతం బొలిచెఁ గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్.
| 78
|
- ↑ చ.బొంగడొందు
- ↑ క.యేతెంచిన
- ↑ క.సందువ
- ↑ భాస్కరుఁడు
- ↑ క.జాతు
- ↑ క.సాంద్రశోణమతిభామరమై
- ↑ క.కుంభవ
- ↑ క.ర్రసరాశి
- ↑ సుంకెసాల
- ↑ క.సాంధ్య
- ↑ క.రాశి
- ↑ క.నెల్లటు
- ↑ క.చక్కుగా