పుట:ప్రబంధరత్నాకరము.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాయక త్రోచున ట్లినుఁడు పశ్చిమవారిధిఁ గ్రుంకె శీకర
ప్రాయ[వి]ధూమరేఖ లనఁ బర్వె నుడుప్రకరాంధకారముల్.

69

బొడ్డపాటి పేరయ్య – పద్మినీవల్లభము

ఆ.

ఆ ప్రదోషయ+ములై యున్న సమయంపు
గంట వేటకాని కరము దివ్వె
సొగపు దోచెఁ గ్రుంకనగు ప్రొద్దు పరసంధ్య
వెనుక నిరులు ముందు వెలుగు నగుట.

70

భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర

తే.

వారుణీస్పర్శమున నాదు వాఁడి దఱిగె
సకలతీర్థనిదాన మీ జలనిధాన
మే నొనర్చెదఁ బావనస్నాన మనుచు
మునుఁగుగతి పశ్చిమాంబుధి మునిఁగె నినుఁడు.

71

సూర్యాస్తమానచంద్రోదయములకు

నంది మల్లయ్య – ఘంటసింగయ్య – ప్రబోధచంద్రోదయము [4-48]

శా.

అంతం గుంకుమపంకపాటలిమతో నస్తాద్రిపైఁ దోఁచె భా
స్వంతుం డిందుఁడు నింద్రగోపరుచిఁ బూర్వక్ష్మాధరం బెక్కె వా
రెం[1]తేఁ జూడఁగనొప్పి రప్పుడు హృషీకేశప్రతాపప్రభా
ప్రాంతం బందలి రెంట పంజు వలె సొంపారెన్ దినాంతంబునన్.

72

[2]నంది తిమ్మన – పారిజాతాపహరణము [2-42]

ఉ.

పొందుగఁ బశ్చిమాబ్ధితటభూస్థలి నంశుమదంశుమత్ఫలా
కందము వాసరాంతహలికాప్రవరుం డిడె సాంధ్యరీతి భృ
త్కందళమున్ దమోదళయుతంబునునై గెల పండి వ్రాలెఁ బూ
ర్ణేందుని పేరఁ బ్రాచి నది హేతువు వెన్నెలకల్మి కల్మికిన్‌.

73

[2-43]

చ.

సమయవిలాసి శోణమణిసంగతమౌక్తికరత్నహారమున్‌
గ్రమమునఁ గ్రుచ్చుచో నరుణరత్నముఁ దామును సాంధ్యరశ్మి సూ
త్రమునఁ బొసంగఁ గ్రుచ్చి యెడ దవ్వగఁ ద్రోచి పిఱుంద చేర్చుము
త్తెముక్రియఁ దోఁచె నయ్యమృతదీధితి లాంఛన[3]రంధ్రసంగతిన్‌.

74
  1. క.లో చూ
  2. అల్లసాని పెద్దన
  3. క.సాంద్ర