చ. |
అరయఁగ లోకబాంధవుఁడనై భువనత్రయకర్మసాక్షినై
హరిహరపద్మసంభవమయాకృతినై మను నాకు వారుణీ
పరిచయదోష మబ్బెనని భానుఁడు తద్దురితోపశాంతికై
శరనిధిఁ గ్రుంకెనా నపరశైలతిరోహితుఁ డయ్యె [1]నత్తఱిన్.
| 64
|
[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-67]
చ. |
చరమధరాధరాగ్రమునఁ జాఱెఁడువేళఁ బతంగుఁ డంగజి
త్వరితమనస్కమై నిలిచి తన్ను గనుంగొను [3]సౌధశేఖరో
పరితరుణీజనంబుముఖపద్మముల న్వికసింపఁజేసె స
త్పురుషులు తారు దుర్దశలఁ బోవుచునైనను బ్రోతు రాశ్రితున్.
| 65
|
[మద్దికాయల మల్లయ్య] - రేవతీపరిణయము
మ. |
కటకండూయన మంతనంతఁ జలుపంగాఁ దామ్రపర్ణీమదో
త్కటదానంబులు నిండి [4]జిడ్డుకొన కన్తగ్రావకూటద్యష
త్తటముల్ మెట్టఁగఁ [5]జిక్కుఁ బాఱె నవినీతంబుల్ వడిం బాఱె నా
[6]పుటలిన్యాపుండు ? గ్రుంకెఁ బశ్చిమమహాంభోరాశిపూరంబునన్.
| 66
|
తెనాలి రామలింగయ్య – హరిలీలావిలాసము
ఉ. |
ఎంతయు రాజు[7]తోడఁ బగయే [8]కొమరో మధుపప్రసక్తి య
శ్రాంతము గల్గు తమ్ముల ప్రచారము గాదని [+ +] నోడి దే
శాంతర మేఁగె నాఁగ నపరాశఁ బతంగుఁడు దాఁగె నట్టి వృ
త్తాంత మెఱింగి సిగ్గొలసినట్టులు [9]గందె సరోరుహంబులున్.
| 67
|
[నంది తిమ్మన్న] పారిజాతము [4-45]
క. |
ఘనసాంధ్యరాగవినతా
తనయగరుత్సమితి [10]కడిఁది తాఁకున ధర వ్రా
లిన గగనఫణిఫణామణి
యన రవిమండలము పశ్చిమాంబుధిఁ గ్రుంకెన్.
| 68
|
ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [4-124]
ఉ. |
ఆ యెడఁ గాలకారకుఁ డహర్పతియున్ గనకంపుఁ బూదె వై
హాయసవీథియన్ గొలిమియందుల నెఱ్ఱఁగఁ గాఁచి నీటిలోఁ
|
|
- ↑ చ.నయ్యెడన్
- ↑ సుంకసాల
- ↑ క.సోమ
- ↑ క.జెడ్డు, చ.చెండు
- ↑ చ.జిర్కు
- ↑ చ.బుటకన్యాప్తుఁడు ?
- ↑ చ.తోడిపగయే
- ↑ క.కొమలో, చ.కొదవో
- ↑ క.గంటె
- ↑ క.కణింది