|
గోకిలరీతి నుందుననుకున్నను నంటివి కాక పాపపుం
గాకమ! నీకు నమ్మధురగానము గల్గునె యెన్ని పల్కినన్.
| 61
|
సూర్యాస్తమానము
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
పటుచండతాండవోత్పతితధూర్జటిజటా
మకుటాగ్రఫణిఫణామణి యనంగ
నికటవాతాఘాతనిర్భగ్నమగు పశ్చి
మాచలధాతుశృంగాగ్ర మనఁగ
[1]సంధ్యాప్రభిన్నరక్షఃకోటిపై [2]వియ
చ్చరణుఁ డేసిన సుదర్శన మనంగ
ఘననిశాంబుధిజగంబను కలం బెడలక
యుండంగఁ ద్రోచిన గుం డనంగఁ
|
|
తే. |
దేజమంతయు శిఖియందుఁ దిరము గొల్పి
కణఁకఁ దలలెత్తి పటుమాంస[3]కబళశంకఁ
బదరి జలచరపంక్తిపై పైఁబడంగఁ
బడియె నపరాంబురాశిలోఁ బద్మహితుఁడు.
| 62
|
సీ. |
పశ్చిమాంభోనిధిప్రాంతదేశంబున
రంజిల్లు విద్రుమకుంజ మనఁగఁ
జరమాద్రిశిఖరదేశంబునఁ గనుపట్టు
కమనీయఘనరత్నకలశ మనఁగ
నపరదిక్కామిని యర్థితోఁ గనుగొను
[4]పద్మరాగంపుదర్పణ మనంగఁ
బ్రత్యగ్దిశాకుంభిఫాలభాగమ్మునఁ
బొలుపాఱు జేగురుబొ ట్టనంగ
|
|
తే. |
భూరికాంతి నభోవనభూమిఁ బండి
కాలశుకతుండహతి [5]బిట్టు గదలి యపర
జలధిలోఁ బడు దాడిమఫల మనంగ
[6]నబ్జినీవరబాంధవుం డస్తమించె.
| 63
|
- ↑ క.సద్యోపభిన్నరక్షణ
- ↑ క.వియచ్చరణకెన్న
- ↑ చ.కలశ
- ↑ క.పద్మమాణిక్య
- ↑ క.బట్టు
- ↑ క.నంజినీ