పుట:ప్రబంధరత్నాకరము.pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవధానభారతి – మంచన – కేయూరబాహుచరిత్ర [3-31]

మ.

అరయం దుష్టజనుల్ స్వదుశ్చరణజాత్యంధుల్ నిజాచారధీ
గరిమాదిస్తుతివాద్యు లాత్మధ[న]రక్షాజాగరూ[కే]క్షణుల్
పరదోషేక్షణదివ్యచక్షు లితరప్రజ్ఞాభిశంసానిరం
తరమౌనవ్రతు లన్యవిత్తహరణధ్యానక్రియానైష్ఠికుల్.

56

[?]

క.

కెలనికి మేలును దనకుం
గలిగెడి నింద్రత్వమైనఁ గాదనుఁ దుది దాఁ
బొలిసిన మెలసి తలంచును
ఖలుఁ డొరులకుఁ గీడు సేయఁ గలిగినఁ జాలున్.

57

అన్యాపదేశములు

[?]

మ.

అతిమాధుర్యమనోజ్ఞచూతఫల మాహారంబుగాఁ గల్గియున్
మతి గర్వింపక కోకిలంబు పలుకున్ మంజూక్తి జంబాలదూ
షితనీహారముఁ గ్రోలి భేక మఱచున్ జృంభించి యాకర్ణ[న]
స్థితిఁ గాఠిన్యము దోఁపఁగా బెకబెక [1]న్ఛీకాకులారావముల్.

58

[?]

ఉ.

పీనసరోగి నిన్నుఁ దిలపిష్టసమానము [2]గాఁగఁ జూచినన్
వాని వివేకశూన్యతకు వందురనేల కురంగనాభమా!
మానవతీకపోలకుచ[3]మండలచిత్రితపత్రవల్లికా
నూన[4]విశేషసంపదల నొందుట లోకము ని న్నెఱుంగదే.

59

[?]

ఉ.

ఏచి [5]తలిర్చి గొప్పలగు నెఱ్ఱనిపువ్వులతోడి బూరుగున్
రాచిలు కర్థిఁ జేరి మధురంపుఫలంబుల కాస సేసినన్
[6]గాచిన కాయలుం బగిలి గాలివశంబున దూదియై చనన్
జూచి నిరాశయై చనినఁజొ ప్పగు నీచుల నాశ్రయించినన్.

60

[?]

ఉ.

ఈఁకలు నల్లనైనవని యెంచి విశాలరసాలశాఖ యు
త్సేకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్

  1. చ.స్ఫీతా
  2. చ.చేసినంతనే
  3. చ.మండితచిత్రపత్రికా
  4. చ.వితానవాసనల
  5. క.తలించి
  6. చ.నాల్గవపాదము మూఁడవపాదముగ కలదు. నాల్గవపాదము లేదు. చుక్కలు పెట్టఁబడినవి.