బొడ్డపాటి పేరయ్య – శంకరవిజయము
ఆ. |
తనకు బలముఁ గలిగి తన[1]మంత్రిమిత్రాప్త
బలము దలకుఁ దోడుపడుట కలిగి
వైరిబలము దఱిగి వారిచుట్టము లెల్లఁ
గ్రిందువడినవేళ గెలువవచ్చు.
| 31
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [4-172]
సీ. |
శక్తిత్రయంబునఁ జతురుఁడై చతురుపా
యంబులకును సమయం బెఱింగి
పంచేంద్రియముల నిర్జించి స్వాయత్తుఁడై
షాడ్గుణ్యగరిమ ప్రశస్తిఁ గాంచి
వ్యసనంబు లేడును వర్జించి [రాజ]దో
షములు పద్నాల్గు [2]జిత్తమున నెఱిఁగి
సాక్షిమాత్రంబుగా సచివుఁ బ్రతిష్ఠించి
యాత్మ [3]యెంతయు [4]నిసుమంతయైన
|
|
తే. |
నింగితాకారచేష్టల నెఱుఁగనీక
పరుల నెవ్వరి [విశ్వసింప]క మనమున
[5]సంతతంబు శరీరరక్షాక్రమంబు
నేమరక యుండవలయు మహీవిభుండు.
| 32
|
సీ. |
పతిహితుం డతిధర్మపరుఁడు నీతిధురీణుఁ
డింగితజ్ఞుఁడు జితేంద్రియుండు
[మంత్రరక్ష]కుఁ డన్యమర్మభేది ప్రజాను
రాగి సుశ్రోత విరాగి భోగి
యుచితయత్నపరుండు [ను]త్కోచ[6]విముఖుండు
శాంతుఁ డతిప్రౌఢసత్యవాది
పరధనపరదారపరపరివారవ
ర్జితుఁడు ప్రఖ్యాతుండు శ్రీకరుండు
|
|
తే. |
బ్రాహ్మణుఁడు మంత్రి గాఁదగుఁ బరిగణింప
గుణము లిట్టివిగా సమకూఱెనేని
|
|
- ↑ క.మిత్ర
- ↑ క.చిత్రముగ
- ↑ క.యంతయు
- ↑ క.నుసుమంత
- ↑ క.సతతమును బరశరీర
- ↑ క.సు