|
కేశవతల్ప పద్మభవ కేకిసవాహన దానవేశ దే
వేశుల కిచ్చునట్టి పరమేశ్వరుఁ డీవుత మా కభీష్టముల్.
| 39
|
[శేషనాథుఁడు - పర్వతపురాణము] [1-5]
ఉ. |
తత్తఱపాటుతో నిరులు తద్దయు మాన్పఁగఁ జాలు కన్ను ను
వ్వెత్తున వేల్పుమూఁకలకు విందులు వెట్టెడి కన్నుదమ్మియున్
మొత్త మెలర్ప లచ్చికిని [1]మున్నుగఁ బుట్టిన ముద్దుఁబట్టి మే
నెత్తిలఁ జూచు కన్ను గల యిట్టిఁ[డి] వేలుపుఁ గొల్తు నిచ్చలున్.
| 40
|
ఉ. |
అంబరసీమఁ దారలు జటాటవి మల్లెవిరుల్ భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననందగి మౌక్తిక తుల్యమౌళిగం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మమ్ముఁ బ్రోవుతన్.
| 41
|
బొడ్డుపాటి కొండయ – త్రిపురవిజయము
సీ. |
తొమ్మిది తునుకల నెమ్మిఁగూర్చిన తేరు
సరిజోకఁ గూడని చక్రయుగము
నొకముఖంబున గడ్పనోపనిసారథి
రూపింపరాని వారువపు సమితి
బెడిదంపుఁ దెగలకుఁ బెలుచైన విలుకమ్మి
గాలిచేఁ బ్రొద్దులు గడపు నారి
పదివంకలై చాయఁ బాఱని బాణంబు
పడి [2]బత్యములు లేని భటగణంబు
|
|
తే. |
పొందువడఁజేసి, దైత్యుల పురము లేసి
యఖిలజగములు రక్షించు నట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!
| 42
|
సీ. |
కడఁగి యెక్క[3]డికైనఁ గదలని యరదంబు
యరదంబుపై నిల్చినట్టి విల్లు
వింటికిఁ గాఁపుగా విహరించు చక్రముల్
చక్రములను బ్రొద్దు జరపు శరము
|
|
- ↑ క. మున్నుగ, ట. ముద్దుగ
- ↑ ట. బత్తెములు
- ↑ ట. డనైన