|
జనుఁగాని యాజ్ఞఁ బొత్తీఁ
జన దధిపతికిన్ వివేకచతురాననుఁడా.
| 22
|
క. |
సకలవ్యసనికిఁ జుట్టము
నకు మంత్రికి నిష్టభృత్యునకు నజ్జకు నొ
జ్జకుఁ బోటుగాని కర్థా
ధికార మీఁ జనదు నయ[1]గతిని బద్దెనృపా!
| 23
|
చ. |
నయమునఁగాని భూమి ప్రజ నమ్మదు నమ్మినఁగాని యర్థసం
చయమును దంత్రవృద్ధియును జాలదు చాలినఁగాని శత్రులన్
బయిచని యోర్వరాదు పరపక్ష మణంగినగాని భూమి య
క్షయముగ నేలరా దనిరి [2]కావ్యచతుర్ముఖ బద్దెభూపతీ!
| 24
|
నన్నయభట్టు – సభాపర్వము [1-35]
క. |
[3]ఉపధాశుద్ధులఁ బాప
వ్యపగతబుద్ధుల వినీతి[4]వర్తుల[5]సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.
| 25
|
తిక్కనసోమయాజి – ఉద్యోగపర్వము [2-37]
తే. |
ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
[6]యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు.
| 26
|
సీ. |
బలుగాపు వాకిళ్ళఁ బగలు రేయును నిడి
కోటఁ బాళెముఁ దగు[7]చోటఁ బెట్టి
[8]కనుపట్ల [9]నెల్లె[డ] గావలి నియమించి
నడిమిచావఁడి దగు నరుల నునిచి
నగరిచుట్టును జాలె నడిపించి క్రంతలఁ
|
|
- ↑ క.మతికి
- ↑ క.కాదె
- ↑ క.ఉపగత
- ↑ క.వంతుల
- ↑ క.సమతన్
- ↑ క.యెనిమిటి
- ↑ క.కోట
- ↑ క.కనుమట్ల
- ↑ చ.నెల్ల