పుట:ప్రబంధరత్నాకరము.pdf/156

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాదుగొననట్లు [?] భూప్రజ
బాధించిన నేల గలుగు పతి కరిగోరుల్.

13

[2-29]

తే.

కిరణములు లేని పగలింటిసరణిఁ దరణి
వెలుఁగ నేర్చునె యుదయాస్తవేళలందుఁ
గాన విను ముగ్రతేజులకైన మూల
బలము లేకున్నఁ గడుపెంపుఁ బడయరాదు.

14

[2-41]

క.

గాలపుటెర యిచ్చిగదా
వాలుగలం దిగిచికొనుట వక్రరిపుఁడు దా
నై లోఁబడునంతకు బల
శాలియు దానంబు సూపఁ జను నొక్కయెడన్.

15

[2-42]

క.

[1]చొరవ తనకీని వెదురుల
నొరయించి దహించు గాడ్పు నోజన్ బొదియై
పెరిగెడు నృపులకు [2]నంత
ర్విరసము గలిగించు వెఱవు వెదకవలయున్.

16

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత్ర [2-20]

సీ.

పరమండలోద్భేదపదము లాలోకించి
              మంత్రరక్షణకళామహిమఁ దాల్చి
ద్వీపాంతరంబుల తెఱఁగు లాకర్ణించి
              గడినున్న మన్నీల క్రమ మెఱింగి
దుర్గాధిపతుల బుద్ధులు విచారము చేసి
              బలముల నప్పటప్పటికిఁ జూచి
నిజరాజధానిలోని విశేషములు గని
              మంత్రిసామంతుల మతము లరసి


తే.

పేదసాదల విన్నపం బాదరించి
వ్రతులమైనట్టి మముఁబోటి వారి నరసి
రాజ్యమేలినఁ దగుఁగాక రాజ్యవైభ
వంబు గలదని సుఖియించువాఁడు నృపుఁడె.

17
  1. క.చేరువ
  2. క.అంతేవిరసము