పుట:ప్రబంధరత్నాకరము.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర[1-1]

ఉ.

శ్రీమయపత్రముల్ జటలఁ జెల్వగు నభ్రతరంగిణీకణ
స్తోమము పుష్పముల్ ఫలము సోముఁడునై పొలు[1]పొంది పార్వతీ
కోమలదేహవల్లిఁ బెనగొన్న సమంచితదక్షవాటికా
భీమయదేవకల్పక మభీష్టఫలంబులు మాకు నీవుతన్.

35

[2-135]

సీ.

కదలి పాఱని తేరు వదలఁజాలని పేరు
              పఱపఁగా నెఱపఁగా నెఱుగరేని
సానఁబట్టని యమ్ము మేనఁబెట్టని సొమ్ముఁ
              బుట్టఁగాఁ చెట్టుఁగా [2]ముట్టరేనిఁ
గంతు గంధపుఁ బూఁత వింత చందపు మేఁతఁ
              బూయఁగా మేయఁగా డాయరేని
మింటఁబుట్టని ధార యొంటఁగట్టని చీర
              తల యందు మొలయందు [3]నిలుపరేని


తే.

[4]మెఱపువిల్లు విలాసంబు నెఱుపునిల్లు
గలుగ నుతి కెక్కరేని నా కరము లెత్తి
మ్రొక్క నటువంటి దైవసమూహములకుఁ
గ్లేశభవభంగ! యిష్టకామేశలింగ!

36

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

ఉ.

అడఁగఁ గెంజడల్ దొలఁకియాడఁగ జాహ్నవి దిక్కు లెల్ల న
ల్లాడఁగ భూతధాత్రి యసియాడఁగ నాకము నాకసంబు నూ
టాడఁగ ముజ్జగంబు గొనియాడఁగ నిచ్చలు నీవు తాండవం
బాడఁగ గౌరినిన్ సరసమాడఁగఁ జేరునటా! మహానటా!

37

బమ్మెర పోతరాజు – భాగవతము [ప్రథమస్కంధము] [1-2]

ఉ.

వాలిన భక్తి మ్రొక్కెద నవారితతాండవకేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథగర్వపర్వతో
న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాళికిన్.

38

రంగనాథుఁడు

ఉ.

గోశతపంచవార్థులును గోయుగవార్ధులు గోత్రివార్ధులున్
గోశరవార్ధులున్ విదితగోశత[వార్ధులు] పంచవార్ధు లా

  1. క. పొందు
  2. క. బుట్ట
  3. క. చెలువ
  4. క. మేరు