|
దివ్యనీలంబులతేట లల్లనఁ బర్వె
భువనాధిపతి వేడ్కఁ బొంగి పొరలె
|
|
తే. |
దీపికాజాలమెల్లఁ జిత్రించినట్టి
రమణఁ దోఁపంగ దృక్చకోరములు మెచ్చ
నమితతేజోవిరాజమానాత్ముఁడైన
పుత్త్రచంద్రుండు జననము వొందునపుడు.
| 209
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత్ర [1-88]
మ. |
కురిసెం బువ్వులవాన చూపఱుల చూడ్కుల్ వేడ్క నోలాడఁగా
నెరసెన్ మెల్లని చల్లగాలి కొదమల్ నెత్తావి నిండారఁగాఁ
బొరసెన్ దిక్కుల నొక్క వింత చెలువంబుం దత్కుమారప్రతా
పరుచిం బోలమి నాఁబ్రశాంతగతి సంప్రాప్తించె వైశ్వానరున్.
| 210
|
బాలింతరాలు
ధూర్జటి – శ్రీకాళహస్తిమాహాత్మ్యము
మ. |
తలఁ బంకించిన నూనె పుక్కిట సదా తాంబూలమున్ నేత్రక
జ్జలమున్ కంధరఁ గట్టుకొన్న వస పూసల్ గబ్బిపా లుబ్బు గు
బ్బలు నేకాంగు[ళికార్పితా]లకలసద్భస్మంబు [జి]డ్డైన దు
వ్వలువం [1]జెల్వుగ బిడ్డకాన్పు నడిపెన్ వామాక్షి బాలింతయై.
| 211
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [4-62]
సీ. |
తల లంటి రతిపుణ్యతాపసాంగన[లు నెం]
తయు వేడ్క నింగుదీతైలమునను
పుటజాంగణమునఁ గాపు నివిరి పెరటిలో
వెల్లుల్లిపొగ యిచ్చి వీతిహాత్రుఁ
జాగించి రంచితోత్సవము [2]ముప్పురుటాలి
వైభవంబు తృతీయవాసరమున
నాఱవదివసంబునం దాచరించిరి
బహుయోగినీగణప్రార్థనములు
|
|
తే. |
కొలన గుడిపిరి దినముల కొలఁది యెఱిఁగి
యఖిలమునిధర్మపత్నుల నామతించి
విన్నఁబోకుండఁ గ్రియలెల్ల విస్తరిల్లఁ
దగ నొనర్చిరి పురుటాలి [3]తగవులెల్ల.
| 212
|
- ↑ క.బెల్డుగ
- ↑ క.ముప్పూటల
- ↑ క.తగవెఱింగి