పుట:ప్రబంధరత్నాకరము.pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నంగకము లొక్కమై నున్న [1]వాంగములను[?]
గలిమిలేములు దమలోన నలకరించి
[2]యరయఁ బుత్రోత్సవమున కాయత్తపడెనొ
యనఁగ సతి మేన గర్భచిహ్నములు దోఁచె.

203

నంది మల్లయ్య - మదనసేనము

సీ.

మెఱుఁగుశృంగములందు మెదలకయున్న వి
              నీలమేఘంబులు నీరజాస్య!
వెన్నెలపులుఁగులు వేకువ చంద్రుపైఁ
              దేలుచున్నవి చూడు తియ్యఁబోణి!
మింట నాగడపలు మెల్లమెల్లన విచ్చి
              కానరావయ్యె నో కలువకంటి!
పారిజాతపుఁ దీగ బహువర్ణపుష్పభా
              రంబు మోవగలేదు కంబుకంఠి!


తే.

యనుచుఁ దమలోన [3]నర్మోక్తు లాడుకొనుచుఁ
దనకు నుపచారములు సేయు ననుఁగుఁజెలులఁ
జూచి నవ్వుచు సహజన్య చూడనొప్పెఁ
జారు[4]దౌహృదలక్షణసహిత యగుచు.

204

మలయమారుతము

సర్వన - షష్టమము

సీ.

[5]ఒడియాపగ నున్న [6]యుదటు జుక్కవ లింక
              నక్కట [7]నెగసి గాశాడకున్నె
సరగామి నెంతయుఁ జఱుల లోఁబడనున్న
              గిరులెల్ల నిఁకఁ బెచ్చు పెరుగకున్నె
పగిలి లోఁగరిగెడు బంగారుకుండలు
              తలకెక్కి యటమీఁదఁ జెలఁగకున్నె
కలఁగిన మాలూరఫలము లింకిటుమీఁద
              గిట్టి తీదీపులఁ బెట్టకున్నె


తే.

[8]పరులు గన్గొన నున్నతిఁ బాయవలసె
నక్కటా మాకు నని యని యాత్మఁ గుంద
మునుపుఁ [9]జిత్తాంధకారంబు మొనసె ననఁగ
నలినలోచన చనుమొనల్ నల్లనయ్యె.

205
  1. చ.సాంగములను[?]
  2. క.యెసగఁ
  3. చ.గర్భోక్తులు
  4. చ.దోహద
  5. చ.పొడి
  6. చ.పుదులు
  7. చ.నెగసె
  8. నదు....గమైననున్నతి
  9. చ.జింతాంధకారంబు