|
బలుచని చెక్కులు పలకఁబాఱె
ఫలరసంబున కెవ్వి ప్రతి రామి నొల్లదో
యన జిహ్వ కన్నిట నరుచి పుట్టె
గర్భస్థుఁ డగు బాలు కమనీయగుణభార
మహిమ నా నడ [1]లతిమందమయ్యెఁ
|
|
తే. |
గలికి బేడిసమీలతోఁ గలహమాడు
వాలుఁజూపుల [దాటులు] డీలుపడియె
మంటి కమ్మని తావికి మనసు వారె
నాఁడు నాఁటికిఁ బాలికానలినముఖికి.
| 201
|
ఘటకాశి మల్లుభట్టు - జలపాలిమహత్త్వము
సీ. |
ధవళాంగుఁ డగు శంభుదత్తగర్భము గాఁగ
వనితదేహము పాండువర్ణమయ్యెఁ
బుత్త్రలాభానందపూరితకుక్షియై
యఖిలభక్ష్యములందు నరుచియయ్యెఁ
జెలులు వచ్చినఁ జూచి సిగ్గున నున్నట్లు
పలుక[2]నోపకయుండె నలసవృత్తిఁ
దతిమరాళములకు గతి నేర్పు కైవడి
నలినాక్షి మందయానము వహించె
|
|
తే. |
హేమకలశాగ్రములయందు నింద్రనీల
రత్నముల రీతిఁ దత్కుచాగ్రంబులందు
నలుపు సొంపారు గర్భచిహ్నములు గలిగి
యతివ[3]తతికిని సంతోష మావహించె.
| 202
|
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
శ్రీ బయల్పడకుండఁ జికురముల్ తమకప్పుఁ
గుచచూచుకములకుఁ గొంత యిచ్చె
లేమి దోఁపకయుండ లెస్సఁగా నడిమికిఁ
గుచములు తమకల్మిఁ గొంత యిచ్చెఁ
దనువల్లికకు దృష్టి దాఁకకుండఁగ సాధు
దంతముల్ తమకాంతిఁ గొంత యిచ్చెఁ
దరచిసిరింతలై[?] దాఁటకుండఁగఁ దమ
యలసత చూడ్కుల కంఘ్రు లిచ్చె
|
|
- ↑ క.వడి
- ↑ క.నోడక
- ↑ చ.తల్లికి