గర్భచిహ్నములకు
అంగద బసవయ్య - ఇందుమతీకల్యాణము
సీ. |
శశిమండలముమీఁది సాంద్రచంద్రిక వోలె
నునుమొగంబునఁ దెల్లఁదనము నిల్చె
పసిడికుండలమీఁది బలభిన్మణులు వోలె
వలిచన్నుముక్కుల నలుపు లొదవె
నిఱుపేదమీఁది నిర్ణిద్రసంపద వోలె
మధ్యభాగంబున మహిమఁ దాల్చెఁ
గదలిన[1]లతమీఁది కమ్మబూవులు వోలె
[2]నిలవనిమేన సొమ్ములు దొలంగెఁ
|
|
తే. |
దరుణిగమనంబు మిగుల మాంద్యము వహించె
వనజపత్రాక్షి కోర్కులు కొనలు సాగె
వనిత నేత్రాంతములు వసివాళ్ళు వాడె
[3]రమణి తనువల్లి శయ్యల వ్రాలఁ గణఁగె.
| 199
|
సీ. |
హేమసింహాసనం బెక్క నుద్యోగించు
మణికల్పితాస్థానమంటపమున
విసరించుకొనఁ జూచు వింజామరంబుల
వైరివీరవిలాసవతులచేత
నాటింపఁదలఁచు నానాద్వీపసంధుల
గెలుపుఁగంబంబులు వలసినన్ని
దుష్టరాక్షసకోటిఁ దునుమ విచారించు
మఘవన్ముఖాఖిలామరులు వొగడ
|
|
తే. |
[4]సంతతము జహ్నుకన్యాతటాంతరముల
నధ్వరంబులు గావింప నలవరించు
నెలఁత నిచ్చలు నిజగర్భనివసదర్భ
కప్రభావపరిప్రాప్తి గౌరవమున.
| 200
|
మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-86]
సీ. |
కౌను దొడ్డతనంబుఁ గని చింతపడు గతిఁ
గుచముఖంబులు నీలరుచి వహించె
మందస్మితంబందు మరగి రాదన ముద్దుఁ
|
|
- ↑ క.తల
- ↑ చ.నలవని
- ↑ చ.వనిత
- ↑ క.చ.సంతసము