పుట:ప్రబంధరత్నాకరము.pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాత్మజులు లేని యశ మేల? హర్ష మేల?
యిహముఁ బర మెద్ది సంతానహీనులకును.

194

[1-40]

ఉ.

ముంగిట నాడు పుత్త్రుఁ డతిమోదమునం దను దౌలఁ గాంచి వే
డ్కం గరయుగ్మ మెత్తి చిఱుగంతులతో వెడయేడ్పుతోడ డా
యంగఁ జెలంగి యెత్తికొని యక్కునఁ జక్కఁ[గఁ] జేర్చి ముద్దుమో
ముం గమియార ముద్దిడుట ముజ్జగ మేలుట గాకయుండునే.

195

[1-42]

ఉ.

నారకయాతనాంబుధికి నావ, నిబద్ధకవాటగోపుర
ద్వారమునందుఁ గుంచిక, భవక్షితిజంబునకున్ ఫలంబు, వి
స్ఫారనిజార్థగుప్తి కనపాయనిధిస్థలి, వంశవర్ధనాం
కూరము పుత్త్రునిం బడయఁగోరుట యొప్పదె యెట్టివారికిన్.

196

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-62]

సీ.

లోచనానందకల్లోలినీభర్తకుఁ
              దోయజారాతి పుత్త్రుండు కాఁడె
శ్రవణహితాలాపరత్నాంకురాళికి
              రోహణాచలము పుత్త్రుండు కాఁడె
యమితపాతకపుంజతిమిరమండలికి న
              ఖండదీపంబు పుత్త్రుండు కాఁడె
సంసారసుఖమహీజాతసంఘమునకు
              దోహద[1]సేవ పుత్త్రుండు కాఁడె


తే.

దుఃఖములఁ బాపి ముక్తికిఁ ద్రోవ సూపి
ప్రోవఁ జాలినవాఁడు పుత్త్రుండు కాఁడె
కాన నిహపరసాధనకారణంబు
తల్లిదండ్రుల కాత్మీయతనయుఁ డబల.

197

ఏర్చూరి సింగయ్య – కువలయాశ్వచరిత్ర

ఉ.

వైరి [2]తమిస్రమం బణఁగ వంశమహార్ణవ ముబ్బ బాంధవో
ద్ధారచకోరసంతతి ముదంబునఁ దేలఁగ నర్థివర్గస
త్కైరవజాతమెల్లను వికాసముఁ బొందఁగఁ బుత్త్రచంద్రజ
న్మారవచంద్రికానుభవ మచ్చిన చిత్తము మిన్ను ముట్టదే.

198
  1. క.సేన
  2. చ.తమస్తమంబు