పుట:ప్రబంధరత్నాకరము.pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుని నైషధము [7-188]

స్రగ్ధర.

సరి యాతాయాతరంహ[1]శ్చలకలితరతశ్రాంతినిశ్వాసధారా
పరిషద్వామిశ్రభావ[2]ప్రవిఘటితమిథఃప్రాణభేదోదయంబై
యొరిమ న్వక్షోజపాళీయుగకరిమకరీయుగ్భుజామధ్యచిహ్నా
భరణవ్య[3]క్త్యైకభావోభయవిలసితహృద్భాగమై నిద్రవోయెన్.

192

సంతానవాంఛ

తులసి బసవయ్య – సావిత్రికథ

సీ.

సంతతి లేని సంసారంబు నిస్సార
              మొగి నర్భకులు లేని యొప్పు తప్పు
కొడుకుతోఁ [4]గుడువని కూడు గీడు తనూజు
              లెపుడు క్రీడింపని యిల్లు పొల్లు
పుత్త్రరత్నము లేని భోగంబు రోగంబు
              తనయుఁ గానని [5]వాని తగవు నగవు
పిన్నబిడ్డలు లేని పెక్కువ తక్కువ
              సూనుమై సోఁకని మేను మ్రాను


తే.

కాన నెబ్భంగినైన సంతానలబ్ధి
కాననగు త్రోవఁ బరికించి కానవలయుఁ
గాని యూరకే యున్కి యుక్తంబు గాదు
జగతి సంతతి లేకున్న జన్మహాని.

193

[6]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-39]

సీ.

జలకమార్చినఁ జిన్నిశయ్యలో నొయ్యొయ్య
              గాలు చేయార్పంగఁ గనుట లేదు
కెంగేల నునుబొజ్జ గిలిగింత లిడ నవ్వు
              నెలమోము దమ్మి ముద్దిడుట లేదు
తియ్యదేనియ లొల్కు తీవనవ్వులతోడి
              తొక్కుఁబల్కులు విని చొక్క లేదు
వడఁకుచుఁ జిఱుతప్పుటడుగుల నేతేరఁ
              జేసాచి యక్కునఁ జేర్ప లేదు


తే.

పుత్త్రకులు లేని సిరి యేల? భోగ మేల?
బాలకులు లేని తా మేల? బ్రదు క దేల?

  1. క.సమధికను
  2. క.ప్రతి
  3. క.సమధికను
  4. చ.గూడని
  5. చ.దాని
  6. సుంకె