తే. |
[1]విష్ణువె యడుగనేటికి విశ్వమూర్తి
[2]యగుట నచ్యుతుండఁట నిత్యుఁ డనఁగ నేల
యని మునీంద్రులు గొనియాడ నతిశయిల్లు
నమ్మహాత్ముండు సర్వలోకాధికుండు.
| 31
|
కంచిరాజు సూరయ - కన్నప్పచరిత
ఉ. |
కారణమేమి? రక్కసు నఖంబుల వ్రచ్చితి నాఁడు నీకుఁ బెం
పారఁ గుఠారమబ్బదొ? పురారివిరించులు చేరి యేటికిన్
[3]గోరను బోవు సేఁతలకు గొడ్డలి యన్నఁ దొఱంగితో వినం
గోరెదనన్న యిందిరకుఁ గోర్కులు నిచ్చు ముకుందుఁ గొల్చెదన్.
| 32
|
సీ. |
శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ
మల్లశంకరధర్మ మహితబుద్ధి
[4]కగకూర్మ [5]కిటినరమృగ [6]కుబ్జరామ రా
మానంతబుద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి
ముఖముష్టి కస్త్రీవిముక్తఖలులఁ
దత్పుచ్ఛకర్పరదంష్ట్రాగ్రనఖపద
పరశుబాణహలాంగఖురపుటములఁ
|
|
ఆ. |
జెరివి తాల్చి యెత్తి చీరి బంధించి ని
ర్జించి యేసి యేర్చి చెఱిచి మట్టఁ
గణఁగుచున్న శౌరి కరుణావిధేయుఁడై
మనలఁ గోర్కు లిచ్చి మనుచుఁగాఁత.
| 33
|
ఈశ్వరస్తుతి
[7]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము 3.పీ
మ. |
ముకుటాగ్రస్థితచంద్రచంద్రిక సదా ముంపన్ బ్రభాతం బెఱుం
గక శశ్వత్వరిరంభణానిరతసౌఖ్యస్నిగ్ధుఁడై జాయఁ బా
యక లీలాపరుఁడైన శంకరుఁడు నిత్యప్రీతి సంధించుతన్
సకలాహ్లాదముగా మదీయకృతికిన్ శబ్దార్థదాంపత్యమున్.
| 34
|
- ↑ ట. విష్ణుఁడట యడ్గనేటికి
- ↑ ట. యనఁగ ?
- ↑ క. గోరున
- ↑ ట. గగకూర్య
- ↑ క. కిట
- ↑ క. కుంజ
- ↑ సుంకసాల