పుట:ప్రబంధరత్నాకరము.pdf/138

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[3-225]

సీ.

ఈక్షింపఁగా నేర్చె నిఱ్ఱింకు చూపుల
              మోవిఁ గూర్పఁగ నేర్చె మొలకనవ్వు
పొలయింపఁగా నేర్చె భ్రూలతానటనంబు
              విననేర్చె నర్మోక్తి వీను లాని
యెదురొత్తఁగా నేర్చె [1]నిఱియుఁ గౌఁగిటియందు
              మొగమెత్తఁగా నేర్చె మోవిఁ గదుప
కరమెత్తి యీనేర్చెఁ గర్పూరవీటిక
              నలరింపఁగా నేర్చె నంఘ్రు లొత్తి


తే.

నేర్చె గరువింప మెచ్చింప నేర్చె నేర్చె
మొగము గనుపట్టి యలుక మై [2]మ్రొక్కుఁ గొనఁగ
జెలువ పతిచేతి రతికళాశిక్షణమునఁ
బంచబంగాళముగ లజ్జఁ బాఱద్రోల.

178

పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [3-220]

సీ.

అన్యోన్యసంప్రీతి నలవరింపుచునుండు
              వలరాజు కూఱట గలుగదయ్యె
రమణీయనూతనరతిరహస్యములకుఁ
              గామశాస్త్రంబులు కడమలయ్యె
నుజ్జ్వలమగుచుఁ బెల్లుబ్బెడి రాగవా
              ర్ధులు లేశమైనను దొంకవయ్యె
నితరేతరప్రీతి నెడలింపఁదలఁచిన
              ధృతికి రాఁ దెఱిపి సిద్ధింపదయ్యె


తే.

మమతలును దత్తరింతలు మక్కువలును
జొక్కులును గౌతుకములును [3]సోలడములుఁ
బ్రియములును గాముకతలు తబ్బిబ్బులుగను
సతియుఁ బతియు రతిక్రీడ సలుపునపుడు.

179

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [4-36]

సీ.

జలకంబునకు వాంఛ సలుపఁ డంగన మేని
              కస్తూరి చెమటలఁ గలయఁదోఁగి
ఘనసారగంధపంకముఁ దేరి చూడఁడు
              సతి యూర్పు కమ్మవాసనల [4]సొగసి
నీరాజనమ్ము మన్నింపండు విద్యుల్ల

  1. క.నిదియు
  2. ముద్దు
  3. క.సోలనములు
  4. గ.నొగసి