|
మిద్దెయిల్లు చూఱు మిగిలిన తీవంచ
మఱియుఁ గలుగు కేళిమందిరములు.
| 169
|
ఎఱ్ఱాప్రెగడ – మల్హణ[1]చరిత్ర [2-96]
సీ. |
పగడంపుఁ గంబాల పచ్చటోవరి[యును]
నపరంజి కాళంజి యలరుఁబాన్పు
బంగారు సకినెల పట్టెమంచంబును
వజ్రపు నునుజాలవల్లికయును
కుంకుమతలగడల్ గొజ్జంగిపూఁదెఱల్
తరమైన చంద్రకాంతంపు గిండి
చౌసీతిరతముల సవరని మేల్కట్లు
దీపించు [2]మాణిక్యదీపకళిక
|
|
తే. |
పొసఁగఁ గస్తూరివేది కప్పురపుసురటి
నిలువుటద్దంబు రతనంపుటెత్తుపలక
తళుకుదంతపుబాగాలు కలికిచిలుక
గలిగి యొప్పారు చవికలో పలికినపుడు.
| 170
|
జక్కన – సాహసాంకము [4-219]
సీ. |
కలువఱేకుల మీఱు కలికికన్నుల కాంతి
మేల్కట్టు ముత్యాల మెఱుఁగు వెట్టు
నిండుచందురు [3]నేలు నెమ్మోముబెణఁగులు
నిలువుటద్దమునకుఁ జెలువు లొసఁగ
నరుణాబ్జముల మించు నడుగు[4]ల నునుఁజాయ
నెలకట్టు కెంపుల నిగ్గుఁ జెనక
కారుమెఱుంగులఁ గైకొను తనుదీప్తి
కనకకుడ్యప్రభ గారవింప
|
|
తే. |
సారఘనసారదీపాదిసౌరభంబు
లలఁతి యూర్పుల నెత్తావి నతిశయిల్ల
మందిరాభ్యంతరముఁ జొచ్చె మ్రాను దేఱి
భీతమృగనేత్ర ప్రియసఖీప్రేరణమున.
| 171
|
- ↑ కథ
- ↑ క.మేల్కట్టు
- ↑ క.బోలు
- ↑ క.కెందమ్ములు