|
[1]దెలివిచ్చుఁ జాలముత్తియపుఁజూర్ణము చూర్ణ
వర్ణ మాయువునకు బాధకంబు
|
|
తే. |
పత్రమూలములను రోగ[2]పటల [ముండు]
నగ్ర మది పాపముల కెల్ల నాలయంబు
నడిమి యీనియ బుద్ధి వినాశకరము
వీని వర్జించి తగఁజేయు వీడియంబు.
| 167
|
సీ. |
కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా
ర్థ[3]౦బు వోయిన ప్రాతఁదనము గలిగి
యుజ్జ్వలచ్ఛాయమై నొత్తిన తరువాయి
శశమాంసఖండంబుచంద మగుచు
నొగ రించుకయు లేక మిగులంగఁ దీపైన
క్రముకంబు [4]లెఱ్ఱనై కమ్మ వలచి
దళమెక్కి పండిన తాంబూలదళములు
కాలోపలంబులు [5]కాల్చి వడియఁ
|
|
తే. |
[6]గట్టినటువంటి చూర్ణంబుగా నొనర్చి
భుక్తి గొనక ముందట నాల్గు భోజనాంత
రమున రెండును నటమీఁద రాత్రి నాఱు
మార్లు తమ్మల మొప్పారు మంత్రియప్ప.
| 168
|
కేళీమందిరము
కూచిరాజు ఎఱ్ఱయ – కొక్కోకము
సీ. |
పట్టికంకటి దూదిపరుపు మొక్కలిపీట
యగరుధూపము వెలుఁగైన దివ్వె
పూవుదండలు గంధపొడిపెట్టె బచ్చన
జాలవల్లిక దన్నె మేలుకట్టు
తమపడిగము పచ్చతలగడ చిఱుచాప
సానరాయడపము సంచి గిడ్డి
గొడుగు పావలు గాజుకుడుక సున్నపుఁగ్రోవి
గంధంపుఁజిప్ప బాగాలభరణి
|
|
ఆ. |
దిడ్డిగంబు జీరతెర బోనపుట్టికె
నిలువుటద్దము వీణె చిలుక సురట
|
|
- ↑ క.చను
- ↑ క.మబ్బు
- ↑ క.ప్రమాణంబు
- ↑ క.నొల్తువై
- ↑ క.గార్చి
- ↑ క.నూనికట్టించి