|
ముసిఁడికి శుంఠియు బసుపు సున్నమునకుఁ
దెఱఁగొప్పఁ బొగడకుఁ దెల్లయుప్పు
వట్టివేళ్ళకుఁ బత్తి [1]వావిలి [2]కొడిసెకు
నేయి పాలకును [3]వేన్నీళ్ళు దలఁప
జీడికి సెనఁగ మించిన వసనాభికి
[4]జిఱ్ఱివేళ్ళును నల్ల జీలకఱ్ఱ
|
|
తే. |
తైలశశులకు జిల్లేడుపూల నీళ్ళు
పనసవంటికి నూనె యావడకు [5]ముస్తి
మిరియ మరఁటికిఁ దెగడకు నరయఁ దుమ్మ
లడరు వెలితుమ్మ [6]నేలతంగేడు వైరి.
| 155
|
జయతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము
సీ. |
చనుఁగవఁ బయ్యెద జాఱంగ జాఱంగఁ
గరమూలమున నంటఁ గదిమి కదిమి
వేనలి వెడవెడ వీడంగ వీడంగ
నెలమి మూఁపునఁ జాల నిఱికి నిఱికి
నుదుటిపై నలకలు సెదరంగఁ జెదరంగ
నల్లన ముంజేత నదిమి యదిమి
పొడతెంచు చెమటలు పొదలంగఁ బొదలంగ
నడరు నూర్పులచేత నణఁచి యణఁచి
|
|
తే. |
చన్నులును జేతికలశంబు సరసమాడ
నవ్వు నమృతంబుఁ దమలోన [7]నవ్వులాడ
సిగ్గుఁ దమకంబు వినయంబుఁ జెంగలింప
వెలఁది యమృతము వడ్డించె విబుధపతికి.
| 156
|
ముక్కు తిమ్మయ్య – పారిజాతము [2-19]
సీ. |
శాకపాకంబుల చవులు వక్కాణించు
గతిఁ గంకణంబులు ఘల్లుమనఁగ
నతివేగ మిడుఁడు మీ రను మాడ్కి మేఖలా
కీలితరత్నకింకిణులు మొరయఁ
గలమాన్నరుచితోడఁ గలహించు జాడ దు
వ్వలువ [8]పింజలు ఫెళఫెళ యనంగ
నారగింపుఁడు మీర లని ప్రియం బాడెడు
పొలుపున మట్టియల్ గిలుకరింప
|
|
- ↑ క.వావిరి
- ↑ క.మొడిసెకు
- ↑ చ.వెన్నీళ్ళు
- ↑ క.చిరి
- ↑ క.ముస్తె
- ↑ క.శైల
- ↑ క.నవ్వియాడ
- ↑ చ.పింజెలు