పుట:ప్రబంధరత్నాకరము.pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[3-128]

ఉ.

సంతతమంగళధ్వనులు చామరమౌక్తికపుండరీకముల్
వింత విభూతిగా గురుకవిస్తుతివేళ వరించెఁ [1]బొంత సా
మంతుల నుజ్జగించి కడు మక్కువ నెచ్చెలులైన నీతివి
క్రాంతులు చూపఁగోరి జయకన్యక వచ్చి చళుక్యవల్లభున్.

133

[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-187]

క.

అంగజవికారవశమున
నంగుళములు వణఁక వణఁక నప్పుడు భూభృ
త్పుంగవుఁడు పెద్ద తడవున
మంగళసూత్రంబు గట్టె మానిని యఱుతన్.

134

[3-185]

చ.

ఎగయుచునున్న జక్కవల నేలు చనుంగవ వ్రేఁగునన్ దెగెన్
దెగెననఁ గౌను సాగి కొన నిక్కి [3]బయల్పడు బాహుమూలముల్
ధగధగమంచు నిండు జిగిదట్టపుఁ బైడి వసంతమాడఁగా
మగని శిరంబుపై నునిచె మానిని [4]వే తలబ్రాలు దోయిటన్.

135

[3-192]

సీ.

తఱి వేచి యొండొరు మొఱఁగి కన్గొను నానఁ
              దారలు కడకంటఁ జేరి మెలఁగఁ
బార్శ్వదృష్టికిఁ గానఁబడు నంతయంతన
              నంతయుఁ గనుటగా నాత్మ లలర
హోమధూమంబుల కొఱగు పేరిటఁ జూడ
              కైన నొండొరు మోము లభిముఖముగ
స్పర్శ లేకున్న నాసన్నపార్శ్వంబులు
              పెరపార్శ్వములకంటెఁ బ్రియము గాఁగ


ఆ.

హోమవేదియందు నొక్కపీఠంబున
నొప్పి రపుడు కన్నెయును వరుండు
కంతుఁ డిరువు రందుఁ గల కూర్ము లొక్కింత
చూచి కట్లె వైచి తూచికొనఁగ.

136

అంగర బసవయ్య - ఇందుమతీపరిణయము

సీ.

లాజవిమోక్షవేళాసముద్గతహోమ
              ధూమవాసన మేనఁ దొంగలింప

  1. క.బ్రాహ్మ
  2. సుంకెసాల?
  3. క.నయప్పడు
  4. క.చే