పుట:ప్రబంధరత్నాకరము.pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వీనిలో నొక్క టెద్దియేనైన నంక
ముండియును జెడకున్న వాఁ డువిద వీఁడు
ధర్మపరు హేతువునఁ గీఁడు దాఁకుఁ గాని
పాపవరుఁ దాఁకదనియెడి పలుకు నిజము.

129

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-185]

సీ.

భద్రకాళిభర్త పదతలాహతి బల్లి
              పర వోలె [1]నెపమారఁ బ్రామడయ్యె
దక్షశాపజమైన యా క్షయావ్యాధి ని
              ర్జీవిగా గాసిలఁ జేయదయ్యె
నమృత మెల్లను ద్రాగి యంకసారంగంబు
              బింబమెల్లను నిండఁ బెరుఁగదయ్యె
నాచార్యుఁ డనక భార్యకుఁ దప్పినప్పుడు
              పొడుగర నీ రంకు పొడవదయ్యె


తే.

ప్రథమకళ యారగించెడి పావకుండు
మీఁగడయుఁ బోలెఁ గడిచేసి మ్రింగడయ్యె
నేల యిటుసేయఁ బాంథుల ఫాలవీథి
వనజగర్భుఁడు వ్రాసిన వ్రాఁతఫలము.

130

[?]

క.

లోకము విరహులకును శశి
భీకరుఁ డగు టరుదె? సురలు పీఁకుక తినఁగా
నాకాశపిండమై తిరి
గే కుటిలాత్మునకు నేడ కృప మదిఁ దలఁపన్.

131

వివాహమునకు

పెద్దిరాజు అలంకారము [3-127]

క.

ప్రచురస్వయంవరోచిత
రచనలుఁ గన్యావరాభిరమ్యక్రియలున్
[2]విచితశుభాత్మకవిధులున్
రుచిరవివాహమ్ములందు రూపింపఁదగున్.

132
  1. క.నవ
  2. క.వీచితసాత్త్విక