పుట:ప్రబంధరత్నాకరము.pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జంద్రాదిత్యులప్రభావంబును వైనతేయశేషవ్యాసవాల్మీకిసుకవిప్రశంసయుఁ గవిత్వలక్షణంబును గుకవినిరసనంబును
మన్మథవిభ్రమంబును బురవర్ణనయుఁ బ్రాకార[1]పరిఖాప్రాసాదధ్వజసాలభంజికాగోపురదేవాలయగృహవిలసనంబును
బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రజాతివిస్తారంబును విపణివిభ్రమంబును బుష్పలావికాభిరామంబును వారాంగనావర్ణనయుఁ
బామర[2]భామలచతురతయుఁ [3]జెంచెతలయొప్పును బుణ్యాంగనాజనవిశేషంబును నుద్యానవనసరోవరచయసుభగంబును
మలయమారుతంబును గజాశ్వపదాతివర్గవిలసితంబును నాయకోత్కర్షయు సభావర్ణనయు నృత్తగీతవాద్య
సాహిత్యమంజసంబును నాశీర్వాదంబును నీరాజనవిధానంబును [4]ఛప్పన్నదేశంబుల నామంబులును
రాజ్యపరిపాలనంబును స్త్రీవర్ణనయు నవలోకనంబును నన్యోన్యవీక్షణంబును దశావస్థలును [5]స్త్రీవిరహపురుషవిరహంబులును
విరహభ్రాంతియు శిశిరోపచారంబులును సఖీవాక్యంబులును మన్మథచంద్రాది[6]ప్రార్థనలును దద్దూషణంబులును
[7]వైవాహికాపతివ్రతాలక్షణంబులును [8]నభ్యంగనవిధియును సూపకారవిరాజితంబును విషనిర్విషవిశేషంబులును భోజన
మజ్జనతాంబూ[9]లంబులును గేళీగృహంబులును సురతప్రకారంబును సురతాంత్యశ్రమంబును సంతానవాంఛయు
గర్భలక్షణంబును పుత్త్రోదయంబును బాలింతలక్షణంబును బాలక్రీడయు శైశవంబును యౌవనప్రాదుర్భావంబును
సాముద్రికంబును రాజనీతియును సేవకనీతియును లోకనీతియును సుజనప్రవర్తనంబును గుజనవ్యాప్తియు
నన్యాపదేశంబులును సూర్యాస్తమానంబును సాంధ్యరాగంబును సాయంకాలసమీరణంబును దీపకళికావిధానంబును
విదియచందురునిచందంబును దారకావర్ణనంబును జక్రవాకవియోగంబును విటవిడంబనలక్షణశృంగారంబును
[10]గువిటలక్షణంబును వేశ్యాలక్షణంబును [11]గుటిలవేశ్యాచేష్టలును వేశ్యమాతృప్రగల్భంబులును
భద్ర[12]దత్తకూచిమారపాంచాలలక్షణంబులును జిత్తినీహస్తినీశంఖినీపద్మినీజాతిప్రకారంబును
బాలయౌవనాప్రౌఢలోలాలక్షణంబులును గూటప్రకారంబును రతివిశేషంబును రతివర్ణనంబును గళాస్థానవిశేషంబులును
బ్రణయకలహంబును నందుఁ గూర్మి గలుగుటయు నంధకారంబును నిశివిడంబంబును జారసంచారలక్షణంబును
[13]దూతికావాక్యంబులును చోరలక్షణంబులును జంద్రోదయంబును జంద్రకిరణలాంఛనచంద్రికావిభ్రమంబును
జకోరికావిహారంబును వేగుఁజుక్కు వొడుచుటయుఁ గుక్కుటారావంబును జంద్రతారకాస్తమానంబులును బ్రత్యూషంబును
బ్రభాతమారుతంబును నరుణోదయంబును బ్రభాత[14]రాగోదయంబును [15]సూర్యోదయంబును
మధ్యాహ్నసూర్యవిడంబంబును గ్రీష్మవర్షాశరద్ధేమంతశిశిరవసంతర్తువర్ణనంబులును వనవిహారంబును దశదోహదంబులును
నళికోకిలకీరహంసవిరావసంచారలక్షణంబులును జలకేళియు వస్త్రాభర[16]ణంబులును మధుపానసిద్ధపురుషప్రభావంబును
ద్యూతలక్షణంబును మృగయావినోదంబులును మృగలక్షణంబును సముద్రవర్ణనంబును దల్లంఘన[17]విధంబును
సేతుబంధనంబును నదీవర్ణనంబును బుణ్యక్షేత్రప్రభావంబును వ్రతమాహాత్మ్యంబును గిరివర్ణనంబును
నారదాగస్త్యాదిమహర్షిప్రభావంబులును వైరాగ్యయోగతపోలక్షణంబులును దపోవిఘ్నంబును దేవతాప్రత్యక్షంబులును
దండయాత్రయు శంఖభేరీరవంబులును గుణధ్వనియును రథాస్త్రవేగంబులును బాణపాతంబును బ్రతిజ్ఞయు
వీరాలాపంబులును దూతవాక్యంబులును హీనాధిక్యంబును రణప్రకారంబును మల్లయుద్ధంబును రణభయంబును
రణాంత్యంబును లోభదైన్యగుణంబులును మనోవ్యధయును ధనికదారిద్ర్య[18]క్షుద్వార్ధకలక్షణంబులును రోదనంబును
శకునంబును స్వప్నఫలంబును దిగ్విజయంబును ధర్మోపదేశంబును శృంగారంబును భావవిస్తారంబును గీర్తియు
భూభరణంబును గాంభీర్యధైర్యగుణంబులును దానవిశేషంబును [19]ఖడ్గనూపురప్రతాపగుణంబులును
నుత్తరప్రత్యుత్తరంబులును ధాటీచాటుధారావిశేషంబులును బరోక్షంబును గల్పితకల్పవల్లియు చక్రికా నాగపుష్ప ఖడ్గ
గోమూత్రికా మురజాది బంధంబులును బాదగోపన పాదభ్రమక పంచవిధవృత్త చతుర్విధగర్భకందవృత్త
పంచపాదవృత్తంబులును నిరోష్ఠ్యంబు ద్వ్యక్షరియును నవరసోత్పత్తియును నను వర్ణనంబులు గలుగఁ
గవీంద్రకావ్యనామంబులతో వివరించెద.

27
  1. క.ట. పరిఘా
  2. ట. భామినీ
  3. క. చంచలత
  4. ట. 'ఛప్పన్న'మొదలు 'అవలోకనంబును'వఱకు లేదు.
  5. ట. స్త్రీపురుషవిరహంబులును
  6. ట. ప్రార్థనంబులును
  7. ట. వైవాహిక
  8. ట. అభ్యంగవిధి
  9. ట. లాదులును
  10. ట. విట
  11. ట. గుటీ
  12. ట. దత్తక
  13. ట. దూతికాచోరులవిషయము లేదు.
  14. క. రంగో
  15. ట. అరుణోదయంబును
  16. క. 'వర్ణనం' లేదు.
  17. క. మథనంబును
  18. ట. క్షుదార్తిక
  19. ట. 'ఖడ్గ'మొదలు 'ప్రత్యుత్తరంబులును' వఱకు లేదు.