|
బీర మేమి ధరణిఁ బిచ్చుక [1]యులివేమి
వాలఁగ (?) నేమి వాలుగంటి.
| 110
|
[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-109]
సీ. |
అహికులా(ధిపు) వ్రాసి మంత్రించి దక్షిణ
గంధవాహుని[3]రాకఁ గట్టు వఱతు
రాహుపూజాభిచార మ్మొనరించుచు
శశి బిట్ట బిరుగుడు చంపివైతు
నలువైన శ్రీరామనామమంత్రంబుచేఁ
గలకంఠతతుల వాకట్టి విడుతు
సంపంగి నౌషధసంప్రయోగము [4]సూపి
మొకరి తుమ్మెదపిండు మూర్ఛ వుత్తు
|
|
తే. |
ప్రాంతభూరుహముల గల పండ్లు డులిచి
త్రుళ్ళు చిలుకల నాలుక ముళ్ళు విఱుతు
పొలఁతి నాయంత నెచ్చెలి ప్రోడ గలుగ
నించు విలుతుని పగకు నీ కేల తలఁక?
| 111
|
మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత [3-111]
సీ. |
చిగురుటాకుల్ కత్తు లగునేని నింతకు
డగర కోయిల నోరు దెగకయున్నె?
యలరుఁదేనియ వేఁడి యగునేని నింతకు
గండుఁదుమ్మెద ముక్కు కమలకున్నె?
యరవిరలే నిప్పు లగునేని నింతకుఁ
బూవిల్తు నఱచేయి పొక్కకున్నె?
యసదు గాలియె వెట్ట యగునేని నింతకుఁ
గమలవనంబెల్లఁ గ్రాఁగకున్నె?
|
|
తే. |
భామ! యేటికిఁ [5]జిగురు కై వాడఁ బాఱ
వనిత! యేటికిఁ దేనెకై వడియఁ బాఱ
వెలఁది! యేటికి ననలకై వెళ్ళబాఱఁ
బొలఁతి! యేటికి సురటిగాడ్పులకు వణఁక?
| 112
|
- ↑ క.యులుమేమి, చ.యలుకేమి
- ↑ సుంకసాల
- ↑ క.పోక
- ↑ క.జోపి
- ↑ క.యిగురు