|
దర్పితానంగశరజాత[1]దావదహన
తప్తమన్మానసమరాళతాపభరము.
| 91
|
మాదయగారి మల్లయ రాజశేఖరచరిత [3-80]
సీ. |
బలువిడి నేతెంచి వలరాచబెబ్బులి
వాఁడి[2]తూపుల గోళ్ళ వ్రచ్చెనేని
యెలమావికొన యెక్కి పెళపెళ [3]వార్చి కో
విల పోటుఁగూఁతలు పెట్టెనేని
బడిబడిఁ గమ్మపుప్పొడి నిప్పుకలు జల్లి
వెడవెడగా గాలి నుడిసెనేని
తేనియల్ గ్రోలి మత్తిలి గండుఁదుమ్మెద
కెరలి ఝమ్మంచు ఝంకించెనేని
|
|
తే. |
బాడబజ్వాలికలతోడఁ గూడి మాడి
వచ్చి వెన్నెలతేట కార్చిచ్చు బలిసి
యిట్టలంబుగఁ బైఁ జుట్టుముట్టెనేని
పాంథు లక్కట యేరీతి బ్రతుకువారు.
| 92
|
ఉ. |
కంగిన పైఁడికుండలు వకావకలై చనఁ జేయఁజాలు చ
న్నుంగవ వ్రేఁగునం దన తనూలత యల్లన నాడఁ దేట వా
లుంగనుదోయి చూపులు తళుక్కున [నల్ల]న వచ్చినన్ దృఢా
లింగన మాచరింప కవ[4]లీఢమనోవ్యధ పాయనేర్చునే.
| 93
|
శ్రీనాథుఁడు – నైషధము [2-32]
శా. |
కాలాంతఃపురకామినీకుచతటీకస్తూరికాసౌరభ
శ్రీలుంటాకము చందనాచలతటశ్రీఖండసంవేష్టిత
వ్యాళస్ఫారఫణాకఠోరవిషనిశ్స్వాసాగ్నిపాణింధమం
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ సేయు దాక్షిణ్యమున్.
| 94
|
తెనాలి రామలింగన - కందర్పకేతువిలాసము
ఉ. |
అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు నేమి చెప్ప నా
కెక్కడఁ జూచినన్ మదనుఁ డెక్కడఁ జూచిన రోహిణీవిభుం
డెక్కడఁ జూచినన్ జిలుక లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు లిం
కెక్కడ [5]వెట్టి యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్.
| 95
|
- ↑ దాహ
- ↑ క.చూపుల
- ↑ క.నార్చి కో
- ↑ క.లీల
- ↑ క.వట్టి