|
నుంకింప భావించి యుమ్మలించుఁ
జపలాక్షి కెమ్మోవి చవిగన్న యట్లైనఁ
జమరించి చర్చించి చిన్నవోవు
మదవతి కౌఁగిలి గదిసిన యట్లైనఁ
బులకించి దేరి సంచలత నొందు
|
|
తే. |
త[రుణి] మెఱసినఁ గోర్కులు తగులు కొలుపు
నోలిఁ దనలోన నల నరపాలసుతుఁడు
మాన మూటాడ గంభీరమహిమ సడల
లజ్జ గడివోవ ధైర్యంబు లావు దిగఁగ.
| 89
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-35]
సీ. |
రవులుకొల్పునొ సన్నరవలలో రాఁజెడు
కామాగ్ని దక్షిణగంధవహుఁడు
పువు [1]శింజినాదంబు చెవి నూది వెఱపింపఁ
జూచునో మరు[2]వింటి జోగితేఁటి
పరులతోడుత మాట పలుకాడకుండంగ
వాకట్టునో మంత్రవాది చిలుక
తెరువు గట్టుకొనంగ మరుని కింకరులకుఁ
గూఁతలు వెట్టునో కోకిలంబు
|
|
తే. |
భావజునిచేత [3]నొవ్వక పవనుచేతఁ
దూలపోవక యళిచేతఁ దొట్రువడక
చిలుకచేఁ దాల్మి చెడక కోకిలముచేత
గాసిగాక శకుంతలఁ గనుట లెస్స.
| 90
|
సీ. |
కుంతలంబుల పేరి కొదమతుమ్మెదలను
గ్రాలుఁగన్నుల పేరి గండుమీలఁ
జన్నుగుబ్బల పేరి చక్రవాకములను
హస్తద్వయము పేరి యబ్జములను
ద్రివళిరేఖల పేరి సవడివీచికలను
నతనాభి పేరి నెన్నడిమి సుడిని
గటిమండలము పేరి ఘనసైకతములను
గోమ[4]లాంఘ్రుల పేరి కూర్మములను
|
|
తే. |
రుచిరమైన శకుంతలరూపసరసి
నీఁదు లాడింపకుండిన నెట్లు పాయు
|
|
- ↑ క.సింగి
- ↑ క.నింటి
- ↑ క.నొప్పక
- ↑ క.లాఖ్యుల