|
నెల్లను సన్నమయ్యెఁ జెలులెల్ల విరోధులుగూడ నైరి భూ
వల్లభుతోడి యల్క గరువంపుఁ జలంబునఁ జూపు చోటికిన్.
| 78
|
తెనాలి రామలింగన - కందర్పకేతువిలాసము
ఉ. |
కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు సరోరుహగంధి మందిరా
రామముఁ జూచి మ్రానుపడు రాజనిభానన సారె కింశుక
స్తోమముఁ జూచి యీ కఱుకు తొయ్యలి కోయిలఁ జూచి కంటగిం
పామతలీలఁ దాల్చు మదనానలతాపవిషాదవేదనన్.
| 79
|
[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-132]
చ. |
పొడిచిన చంద్రుఁ జూచి నృపపుంగవ వచ్చితె యంచు లేచిమై
గడు రతిఁ గేలు సాచి బిగికౌఁగిటి కందకయున్న పూనికల్
సడలి విషణ్ణయై మఱలి శయ్యపయిం బడి వెచ్చనూర్చు న
ప్పడఁతి మనోజతీవ్రశరబాధలఁ జిత్తగతుల్ భ్రమించినన్.
| 80
|
చ. |
విరులు శరంబు లయ్యెఁ [2]జలివెన్నెల యెండిన మంట యయ్యె నున్
గరువలి వజ్ర మయ్యెఁ జెలికత్తెయ యోపనిదయ్యె హస్తపం
జరముగఁ బూని పెంచు శుకశాబమునుం బగసాటిదయ్యె న
త్తరుణికిఁ బంచబాణుఁ డనుదైవము దాఁ బ్రతికూల మౌటచేన్.
| 81
|
చ. |
పులకకదంబముల్ ననిచె ఫుల్లముఖాబ్జవికాససంపదల్
తొలఁగె మరాళికాగతులు దూరము లయ్యె శ్రమాంబుపూరముల్
వెలి విరియంగఁజొచ్చెఁ బురి విచ్చి నటింపఁగ [3]నెమ్మి కోరికన్
బొలఁతుకయందు మన్మథుఁడు పూర్ణముగా శరవృష్టిఁ జూపఁగన్.
| 82
|
పోతరాజు దశమస్కంధము [పూ. భా. 1129]
మ. |
లలనా యేటికిఁ దెల్లవాఱె రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ
గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డాబ్రహ్మ దా
వలఱేఁడున్ దయలేఁడు కీరముల దుర్వారంబు లెట్లోకదే
[4]కలదే మాపటి[5]వేళయుం గలుగనే కంజాక్షుసంభోగముల్.
| 83
|
- ↑ సుంకసాల
- ↑ క.తని
- ↑ క.జొచ్చె
- ↑ క.కలదా
- ↑ క.కాలమాదు, యికనా