పిల్లలమఱ్ఱి వీరయ్య- శాకుంతలము
మ. |
నవలావణ్యపయోధిఁజిత్త మను మంథానాద్రికిం జంద్రికా
పవనాశిం దరిత్రాఁడుగాఁ బెనఁచి [1]యబ్జాతాశుగుం డిచ్చినన్
రవళిన్ కోకిలకీరముల్ [2]దరువ నా రత్నాకరంబందు ను
ద్భవముం బొందిన లక్ష్మి గావలయు నా పద్మాక్షి వీక్షింపఁగన్.
| 62
|
నన్నెచోడఁడు – కుమారసంభవము [8-5]
మ. |
హరినీలోపమమధ్యకేశి శశిబింబాస్యోష్ఠ రాజీవకే
సరనేత్రామలగంధి విద్రుమలతాసద్వర్ణతన్వంగి సిం
ధురకుంభాలసయాన పూర్ణ[3]కుచ సంస్తుత్యా[4]రుణాబ్జాంఘ్రికం
ధర [5]శైలాత్మజ చెప్ప నొప్పదె సుధా[6]ధామార్ధచూడామణీ.
| 63
|
క. |
నెఱి గడచి నాఁడు నాఁటికి
గుఱి గడవగఁ బెరిగి జఘనకుచకచభరముల్
చిఱుతొడలు నడుము నఱ్ఱును
[7]విఱిగెడినో యనుచు గిరిజ వెఱచుచు నడచెన్.
| 64
|
క. |
వ్రాలని నీ చన్నులతో
వ్రాలెడు జక్కవలు సరియె వలలం బెట్టం
జాలెడు నీ కన్నులకును
బాలకి సదృశములె వలలఁ బడు మత్స్యంబుల్.
| 65
|
చూపఱకు
కంచిరాజు సూరయ - కన్నప్పచరిత
మ. |
తమ సౌభాగ్యము లంగసంభవుని భద్రశ్రీల సేవింపఁగాఁ
దమ దృగ్జాలము లాలతాంతశరకుంతశ్రేణిఁ బాలింపఁగాఁ
దమ వృత్తస్తనభారముల్ మరుని చిత్తస్ఫూర్తి సూచింపఁగాఁ
దమకం బారఁగఁ జేరి చూచిరి పుళింద[8]గ్రామణిన్ బ్రేముడిన్.
| 66
|
- ↑ క.యబ్జాతాసనుం డిచ్చినన్
- ↑ క.దరహసే
- ↑ క.రుచి
- ↑ క.రుణజ్వాంఘ్రి
- ↑ క.శైవాత్మ
- ↑ ధర్మార్థ
- ↑ గ.విఱుగక తప్పదని
- ↑ క.గ్రామిన్