పుట:ప్రబంధరత్నాకరము.pdf/102

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్చూరి సింగన – కువలయాశ్వచరిత

సీ.

తనజన్మ మప్పులఁ దలమున్క లని రోసి
              పులిన మీ పొంకంబుఁ బొందె నొక్కొ
పరికింపఁ దనపట్టు దిరుగుడు పా టని
              పెన్నిధి సుడి మూర్తి బెరసె నొక్కొ
బ్రతుకెల్ల గతి బట్టబయలాయె నని చూచి
              గగన మీ పుట్టువుఁ గనియె నొక్కొ
పనిలేక పాసెడి పాపంబుఁ దలపోసి
              జక్కవ లీ రీతి కెక్కె నొక్కొ


ఆ.

యనఁగ లలన జఘన మంబుజముఖి నాభి
చామ నడుము బాల చన్నుదోయి
మహితరుచుల [1]నెగడి మానవపతి కన్ను
దోయి పండువగుచుఁ [2]దోఁచె నంత.

59

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [3-72]

సీ.

కందుఁ జెందని సుధాకరపూర్ణబింబము
              మెఱసి పాయకయున్న మెఱుపుఁదీఁగె
పంకంబునందుఁ గీడ్పడని మృణాళముల్
              కనవిచ్చి చనని జక్కవయుగంబు
వికసించి మొగుడని విమలాంబుజాతముల్
              కర్కశంబులు గాని కరికరములు
చిలుక ము క్కంటిని వలఁతి బింబఫలంబు
              [3]ధావళ్య మెడలని దర్పణములు


ఆ.

ననఁగ నాననంబు నంగంబు హస్తముల్
చన్నుదోయి వాలుగన్ను లూరు
లలఁతి మోవిచెక్కు లలర నయ్యరవింద
గంధి భూమిపాలుఁ గదియ నరిగి.

60

[?]

చ.

వనిత మొగంబు చందురుఁడు వట్రువగుబ్బలు చక్రవాకముల్
తనువు మెఱుంగు నేత్రములు దామరలున్ దడబాటు నొందు కౌ
నని యజుఁ డిందు కొక్క చపలాద్యములందును గందఁ బక్షముల్
తనురహితంబుఁ గేసరవితానముఁ గల్గగఁ జేసె నేర్పునన్.

61
  1. చ.దెగడి
  2. చ.దొరసె
  3. గ.దాంపత్య మెడలని