పుట:ప్రబంధరత్నాకరము.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [2-26]

సీ.

అవనిపై నుండుగా కనఁటి కంబము లెట్టు
              లనఁటి కంబములపై నవని నిలిచె?
గగనంబు గిరులపైఁ గనుపట్టుగా కెట్లు
              గగనంబుపై గిరుల్ గానవచ్చె?
[జలధరంబులమీఁద] శశి యుండుఁగా కెట్లు
              శశిమీఁద నున్నది జలధరంబు?
నాళంబుపైఁ గాక నలినకోశం బెట్లు
              నళినకోశంబుపై నాళమున్న


తే.

దనుచుఁ జూపరులకు విస్మయంబు గొలుపుఁ
[దొడలుఁ గటిమండలం]బును నడుముఁ జన్ను
లాననముఁ గొప్పు నాభియు నారు [2]ననఁగ
నలరె విమలాంగి నవయౌవనాగమమున.

54

[2-48]

సీ.

మెట్లకుఁ దరమిడ మెయికొంట యా యింతి
              కుచముల ప్రతిఁజూపఁ గోరు టెల్ల
[ఖడ్గధారాపదగ్రహణం]బు సేయుట
              సుదతి యా రుపమింపఁ జూచు టెల్ల
గగనారవిందంబుఁ గనుట యా సతి మధ్య
              గతనాభితో సాటి గాంచు టెల్ల
నంధకారము ద్రవ్వు టా యింతి కుంతల
              ముల సాటి [వెట్టంగఁ బూను] టెల్లఁ


తే.

జందమామకు గ్రుక్కి ళా యిందువదన
వదనసామ్యంబు సేయంగ వాంఛ సేఁత
పృథివి కడగాంచు టా రామ పిఱుఁదుతోడ
సదృశవస్తువు గనుటున్న చదరు లేల.

55

శ్రీనాథుఁడు – నైషధము (2-15)

సీ.

జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన
              రతిమన్మథుల వింఢ్లు [3]రమణి బొమలు
కాంతినిర్ఝర మీఁదు కామయౌవనముల
              కుంభప్లవము లింతి కుచయుగంబు
నడిమింత యని కేలఁ దొడికిపట్టిన ధాత
              యంగుళిరేఖ లబ్జాస్యవళులు

  1. సుంకసాల
  2. క.నలర
  3. క.యతివ