పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/99

ఈ పుట ఆమోదించబడ్డది

పర్షియా : గ్రీసు

97


దేశ ప్రజలను, మన పూర్వులను, హిందూస్థానమందలి స్త్రీ పురుషులను, మన దీర్ఘ చరిత్రమార్గములో మృత్యువును చూచి మందహాసము చేసి పరిహసించిన స్త్రీ పురుషులను - అప్రతిష్ట, బానిసత్వములను సహింపక మృత్యువును వరించిన స్త్రీ పురుషులను - నిరంకుశత్వమునకు తలవంచక దానిని విచ్చిన్నముచేయ బొరకొనిన స్త్రీ పురుషులను తలచుకొనిన మన మెట్టులుండును? చిత్తూరును తలచుకొనుము. రాజపుత్ర స్త్రీ పురుషుల అప్రతిమానశౌర్యసాహసములను వర్ణించు నిరుపమ గాథలనుస్మరింపుము. నేటికాలమును కూడ స్మరింపుము. మనవలెనే వెచ్చని నెత్తురు గల మన సహచరులను - ఇండియా స్వాతంత్ర్యము సాధించుటకై మృత్యు ముఖమున ప్రవేశించిన సహచరులను స్మరించుము.

థర్మాపిలె కొంతకాలము మాత్రము పర్షియనుల సైన్యము నాపగలిగెను. ఎక్కువకాల మాపలేదు. గ్రీకుల సైన్యము వారిముందు నిలువ జాలక వెనుదిరిగిపోయెను. కొన్ని గ్రీకు నగరములు పర్షియనుల వశమయ్యెను. శత్రువశమగుటకు సమ్మతించక, అభిమాన పూరితులగు ఏథెన్సు ప్రజలు తమ ప్రియనగరము ధ్వంసమయినను సరే యని దానిని విడిచిపెట్టిరి. ప్రజలందరును ఎక్కువగా నావలమీద నగరమును విడిచి వెళ్ళిపోయిరి. నిర్జననగరమును పర్షియనులు ప్రవేశించి దానిని దగ్దము జేసిరి. ఏథెన్సు నౌకాదళము మాత్రము పరాజయమందలేదు. సాలమిస్ వద్ద గొప్ప నౌకాయుద్ధము జరిగెను. పర్షియనుల నావలు నాశముచేయబడెను. ఈ విపత్తున కధైర్యముజెంది జరక్సస్సు పర్షియాకు తిరిగి పోయెను.

మరికొంత కాలమువరకు పర్షియా మహాసామ్రాజ్యముగానే యుండెను. కాని మారథాన్, సాలమిస్ యుద్ధములు దాని పతనమునకు దారితీసెను. అది ఎట్లు పతనమైనదో ముందు ముందు తెలిసికొందము. ఈ మహాసామ్రాజ్యము తూలిపోవుట చూచిన ఆకాలపు ప్రజలు ఎంత యాశ్చర్యము జెందిరో! హెరొడోటసు ఆ విషయము నాలోచించి యొక