పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/91

ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

89


చెట్టు అనము. ఇంకొకడు ఆకుమాత్రము చూచును. వేరొకడు ప్రకాండమునుమాత్రము చూచును. వీరందరును వృక్షభాగములను మాత్రమే చూచినారు. ఇందు ప్రతియొక్కడును చెట్టు పువ్వే అనిగాని, ఆకే అనిగాని, ప్రకాండమే అనిగాని చెప్పుచు పోరాడుట తెలివితక్కువ కాదా ?

పరలోకమన్న నాకు మోజులేదు. ఇహలోకమున నేను చేయవలసిన కర్తవ్యము నా మనస్సును పూర్తిగా ఆక్రమించినది. నాకర్తవ్యము నెట్లు నెరపవలెనో నాకు తెలిసిన నేను సంతృప్తినందుదును. ఇక్కడ నేను చేయవలసిన పని స్పష్టముగా తెలిసిస వేరొక ప్రపంచము జోలి నాకు లేదు.

వయస్సు వచ్చినకొద్ది నీవు అన్నిరకములు మనుష్యులనుచూతువు. దైవభక్తులు, మతము నంగీకరించనివారు, ఏ పక్షమునకును చెందనివారు, ధనమును, అధికారమును వహించు పెద్దదేవాలయములు, మత సంస్థలు కలవు. ఒక్కొక్కప్పుడు సత్కార్యములకు, ఒక్కొక్కప్పుడు చెడ్డకుకూడ అధికారధనములను వారు వినియోగించుచున్నారు. దైవభక్తి గల ఉదారులగు సత్పురుషులను నీపు చూతువు. మతము పేర ఇతరులను మోసగించి దోచుకొను దుర్మార్గులను కూడ నీపు చూతువు. ఈ విషయములను నీపు బాగుగా పర్యాలోచించి వీటి మంచిచెడ్డలు నీవు స్వతంత్రముగా నిర్ణయించుకోవలెను. పెక్కు విషయములు ఇతరులనుండి మనము నేర్చుకొనవచ్చునుకాని నేర్చుకొనదగ్గ ప్రతివిషయమును మనము అనుభపములోనికి తెచ్చుకోవలెను. కొన్ని విషయములు ప్రతిపురుషుడును, స్త్రీయు తనకుతానే నిర్ణయము చేసికోవలసి యుండును.

నిర్ణయము చేసికొనునప్పుడు తొందరపడకూడదు. విద్యాశిక్షణలున్నగాని ఉదాత్తమగు ముఖ్య విషయములనుగూర్చి నిర్ణయమునకు వచ్చుట కష్టము. ఎవరిమట్టుకు వారు స్వతంత్రముగా ఆలోచించుకొని నిర్ణయమునకు వచ్చుట మంచిది. కాని అట్లు నిర్ణయించుకొనుటకు వారికి సామర్థ్యముండవలెను. అప్పుడు పుట్టినశిశువు ఏవిషయమును నిర్ణయించు