పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/90

ఈ పుట ఆమోదించబడ్డది

88

ప్రపంచ చరిత్ర


యేమనుకొనవలెను? జిలేబీకిని స్వర్గమునకును యథార్థముగా పెద్ద తేడా లేదు. మనమందరమును కొంచమెచ్చుతగ్గుగా ఒంటెత్తుగుణము కలవారము. కాని మనపిల్లలకుమాత్రము ఒంటెత్తుగుణము అబ్బకుండ శిక్షించుటకు ప్రయత్నింతుము. ఏమైనను అన్యుల మేలుకోరుటయే మన ఆదర్శము. అట్టిఆదర్శమును మనమాచరణలో పెట్ట ప్రయత్నించవలెను,

చేసిన పనులకు ఫలితమును పొంద మనమందరము ఆశింతుము. అది సహజమే. కాని మన లక్షమేమి? మనము కోరునది స్వార్ధమా లేక సంఘక్షేమమా? దేశక్షేమమా, లోకకళ్యాణమా : ఈ క్షేమములో మనమును పాల్గొందుముకదా. నాలేఖలలో వెనుక నొక సంస్కృత శ్లోకము నుదహరించితిని. కుటుంబము కొరకు వ్యక్తియు. సంఘము కొరకు కుటుంబముసు. దేశముకొరకు సంఘమును బలికావలెనని దాని తాత్పర్యము. వేరొక శ్లోకభావము నిప్పుడు చెప్పెదను. ఇదిభాగవతము లోనిది. “అష్టసిద్దులను నే నాశించను. మోక్షము నాశించను. జన్మరాహిత్యము కోరను. ఆర్తుల చుఃఖములను నేను సహింతునుగాక. వారిలో ప్రవేశించి వారికి దుఃఖములు లేకుండ చేయుదును గాక."

ఒకమతస్థు డీ విధముగా చెప్పును. వేరొక మతస్థు డింకొకవిధముగా చెప్పును. ఒక డింకొకని బుద్ధిహీనుడనియు, దుర్మార్గుడనియు భావించును. ఇందెవరిమాట సత్యము? చూచుటకుగాని, బుజువుచేయుటకుగాని సాధ్యముకాని విషయములను గూర్చి వారు ప్రసంగింతురు.. కాన ఎవరి వాదము సరియైనదో చెప్పుట కష్టము. అట్టి విషయములను గూర్చి నిర్దారణగా చెప్పుచు తలలు బ్రద్దలుకొట్టుకొనువారికి ఉభయుల మాటలు సాహసోక్తులవలెనే తోచును. మనలో అనేకులము సంకుచిత బుద్ధులము . వివేక మంతగా కలవారము కాము. యావత్తు సత్యముమనకే తెలియునని ఊహించి, దానిని పొరుగువానిచేత బలవంతముగా నమ్మించుట సాహసముకాదా ? మన వాదము సరికావచ్చును. మన పొరుగువాని వాదముకూడ సరికావచ్చును. చెట్టుపై నున్న పువ్వును చూచి దానినే