పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/87

ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

85


శాకాహారులుగానుండ నియమించెననియు తెలిసికొనుటకు నీ విష్టపడ వచ్చును.

ఇప్పుడు మనము బుద్దుడగు గౌతమునివద్దకు వచ్చితిమి. అతడు క్షత్రియుడనియు, రాజకుటుంబములోనివాడనియు నీకు తెలిసియే యుండ వచ్చును. అతని పేరు సిద్ధార్థుడు. అతని తల్లి మాయాదేవి. "ఆమె ఉత్తమ ఇల్లాలు; సర్వమాన్య: బాలచంద్రునివలె ప్రసన్నభావము కలది. భూదేవివలె క్షమాగుణము కలది; పద్మమువలె నిర్మల హృదయము గలది " అని ప్రాతచరిత్ర ఆమెను వర్ణించుచున్నది. సిద్ధార్థుని తల్లిదండ్రులు అతనికి సౌఖ్యమును గూర్చుచుండిరి. సర్వభోగములు అతని కందుబాటులోనుండెను. బాధ, దీనత్వము అతని దృష్టికి తగులకుండ వారు జాగ్రత్తతీసికొనిరి. కాని ఇది సాధ్యముకాలేదు. అతను దరిద్రమును, బాధను, చావునుకూడ చూచినట్లు చెప్పుదురు. చూచుటతోడనే అతని మనస్సు విషాధముతో నిండినది. రాజసౌధమున నాతనికి మనశ్శాంతి చిక్కలేదు. భోగములపై నాతనికి వై ముఖ్యము కలిగెను. అతడు ప్రేమించిన భార్య, సుందరి. యౌవ్వనమధ్యస్థకూడ అతని దృష్టినిబాధపడు మానవులనుండి మరల్పలేకపోయెను. అతడు దీర్ఘాలోచన చేయ మొదలుపెట్టెను. అతడు ఈ బాధలనుండి విముక్తి కనుగొన గోరెను. ఆతడు భరించలేకపోయెను. ఒకనాటి రాత్రి అతడు రాజ సౌధమును, ప్రేమాస్పదులను వీడి, ఒంటరిగా పయనమై విశాల ప్రపంచములోనికి పోయెను. తనమనస్సునకు ఆందోళన కలిగించు సమస్యలను పరిష్కరించవలెననియే అతడు సన్యసించెను. ఇట్టి పరిష్కారము కనుగొనుట కతడెంతకాలమో శ్రమపడెను. చివరకు చాల సంవత్సరముల తరువాత, గయలో ఒక ఆశ్వత్థవృక్షముక్రింద కూర్చునియుండగా అతనికి జ్ఞానము గలిగినదని చెప్పుదురు. అప్పుడతడు జ్ఞానియగు బుద్దుడయ్యెను. ఆ వృక్షమునకు బోధివృక్షమను పేరు వచ్చెను. బోధివృక్షమనగా జ్ఞాన వృక్షమన్నమాట, సారనాథములో డియర్ (లేళ్ళ) తోటలో పురాతన