పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

46

ప్రపంచ చరిత్ర


దేమనగా - వారి గ్రంథములయొక్కయు, భవనములు మున్నగు శిథిలములయొక్కయు సహాయముతో ఆకాలపు ప్రజ లెట్లుండెడివారో ఊహించుకొనుటయే.

గ్రీసును గురించిన యొక విషయము మిక్కిలి మనోహరముగ నుండును. పెద్ద రాజ్యములన్నను, సామ్రాజ్యములన్నను గ్రీకుల కిష్టమున్నట్లు తోచదు. వారికి నగరరాజ్యములపై ఇష్టము. అనగా, ప్రతి నగరమును ఒక స్వతంత్రరాజ్యము. అవి చిన్న ప్రజాప్రభుత్వములు. మధ్యను నగరముండును. దానిచుట్టును పొలము లుండును. వానినుండి నగరమునకు కావలసిన భోజనపదార్దములు వచ్చును. ప్రజాప్రభుత్వముస రాజుండడని నీకు తెలియునుగదా ! ఈ గ్రీకు నగరరాజ్యములకు రాజులు లేరు. ధనవంతులగు పౌరులే వానిని పరిపాలింతురు. సామాన్యప్రజలకు పరిపాలనతో ఎట్టి సంబంధమునులేదు. పలువురు బానిస లుందురు. వారికి హక్కులుండవు. స్త్రీలకుకూడ హక్కులులేవు. నగరరాజ్యములలోని జనసంఖ్యలో ఒకభాగమేపౌరులు. కానవారేరాజకీయ విషయములను గూర్చి వోటు ఇయ్యవచ్చును. ఒక్కస్థలమున పౌరులందరిని చేర్చుట సులభముకాన వారు వోటువేయుట కష్టము కాదు. అది చిన్న నగర రాజ్యము కాబట్టే ఇట్లు చేయుటకు సాధ్యమగుచున్నది. ఒకే దొరతనము క్రిందనున్న పెద్ద దేశమైన నిది సాధ్యముకాదు. ఇండియాలో ఉన్న వోటర్లు అందరునుకాని, పోనీ బెంగాలు రాష్ట్రమందలి వోటర్లందరును గాని, ఆగ్రాలోని వోటర్లందరునుగాని ఒక చోట కూడుట యన నేమో ఊహించుకొనుము. ఆది ఎంతమాత్రము సాధ్యముకాదు. పిదపకాలములో నితరదేశములం దిట్టికష్టము తటస్థించినది. దానిని పరిష్కరించుటకు “ప్రతినిధి ప్రభుత్వము"ల నేర్పాటుచేయవలసివచ్చెను. అనగా ఒక విషయమును నిర్ణయించుటకు ఆ దేశమందలి వోటరులందరును ఒకచోట కూడుటకుబదులు, వారి వారి ప్రతినిధుల నెన్నుకొందురు. ఆ ప్రతినిధు లందరును సమావేశమై దేశమునకు సంబంధించిన రాజకీయ వ్యవహార