పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/37

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతనాగరికతలు : మన వారసత్వము

35


తత్త్వజ్ఞుల పేళ్ళతో పేజీలు నింపవచ్చును. ఆసియాలోని కార్యవాదుల పేళ్ళతోకూడ పేజీలు నింపవచ్చును. ప్రాతకాలములో ఈ మన ప్రాతఖండము ఎంత గొప్పగా, వీర్యవంతముగా నుండెడిదో ఇంకను అనేక విధములుగా నేను చెప్పగలను.

కాల మెట్లు మారినదో ! మన కన్నులయెదుట కాలము మరల మారుచున్నది. సామాన్యముగా శతాబ్దులగుండ చరిత్ర మెల్లగాపనిచేయుచు పోవును. అప్పుడప్పుడు తొందరగా పోవుట, ఉత్పాతము పుట్టుటకూడ కద్దు. అయినను నేడు ఆసియాలో అది తొందరగా పోపుచున్నది. - ధీర్ఘ నిద్రనుండి ఈ ప్రాతఖండము మేల్కొనుచున్నది. ప్రపంచము దానిని పరికించుచున్నది. ఎందుకనగా భావికాలమున ఆసియా ప్రాముఖ్య మధికముగా వహింపబోవుచున్నదని యందఱికిని తెలియును,

5

ప్రాతనాగరికతలు : మన వారసత్వము

జనవరి 9, 1931

వారమునకు రెండుసారులు బాహ్యప్రపంచవర్తమాసములు కొన్ని హిందీవార్తాపత్రికయగు “భారత్" మాకందిచ్చుచుండును. మలక్కా చెరసాలలో అమ్మను సరిగా చూచుటలేదని నిన్న ఆ పత్రికలో చదివితిని. నాకు కొద్దిగా కోపము వచ్చినది. మనస్సు వికలమైనది. " భారత్ "లో ప్రకటించిన వదంతి యథార్థము కాదేమో? దానినిగురించి సందేహములో పడుటకూడ మంచిది కాదు. ఆత్మార్థము, బాధ, ఇబ్బంది సహించుట సులభమే. అది అందఱికిని మంచిదే. లేకున్న మనము మరీ మెత్తని మనస్సుకల వారమగుదుము. ప్రేమాస్పదులగు మనవారు పడుచున్న బాధలను తలచుకొనుట - అందు ముఖ్యముగా మన మేమియు చేయలేని స్థితిలో నున్నప్పుడు సులభమునుకాదు, సుఖకరమునుకాదు. “భారత్"