పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

దెగడవలవదు సరస లీ తెఱగులన్ని దెలసి సుఖియించి తనిసియవ్వలరమేళు
సత్కృపనచింత్యమగు బ్రహ్మసౌఖ్య మొందు డార్యులార? బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సజ్జనులార! యీశతకంబు గేవలశృంగార మని నిరసింపవలదు
శ్రీకృష్ణు డింపార బృందావనంబులో చతురత గోపికాసతులఁ గూడి
జేసిన శృంగారచేష్టలన్నియు చాల మోక్షప్రదములని మున్ను మౌని
వరుఁడు వ్యాసుఁడు శ్రీభాగవతంబులో శిష్టసమ్మతముగ జెప్పలేదె.


గీ.

కృష్ణలీలావిహారంబు లెవ్వ రెన్ని గతులు గొనియాడినను దప్పుగలదె సాధు
జను లుపాదేయమని విని సంతసింపు డంచితిముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఈశతకంబున నేపద్యమునను మా కేవిలాసము చెప్ప నిచ్చగలిగె
నావిలాసంబున కనుగుణసంగతులన్నియు స్పష్టంబు లగుట కిట్లు
క్రమ మొప్ప నాల్గుపాదములను విధిమాని వలసినపాదముల్ వరుసగూర్చి
సీసపద్యంబులు చెప్పితి చరణంబు లెక్కువ యని కవు లెంచవలదు


గీ.

పదము లధికంబులైనట్టి పద్యములను మాలికలుగా గ్రహించి సమముగను
సర్వభావార్ధము లెఱింగి చతురు లెల్ల ముదము గనుడు బ్రహ్మానంద మదియగాదె


సీ.

అఖిలలోకేశ్వరుండైన శ్రీకృష్ణుని శృంగారచర్యలు రంగుమీఱ
యీశతకంబున నింపుగా గలుగుటజేసి దీని రచింపజేసినట్టి
పృథివీశునకు జదివినవారలకు విన్నవారికి నల్విభు భూరికరుణ
యవనిలో దీర్ఘాయురారోగ్యములు బుత్రపౌత్రాభివృద్ధి సంపత్సమృద్ధి


గీ.

ధైర్యగాంభీర్యసద్గుణౌదార్యవినయవిజయసౌశీల్యసౌజన్యవిత్తలాభ
సారధర్మార్ధకామమోక్షములు గలుగు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

(మేరువ పద్యము)

సీ.

ప్రమదాకళాశీఘ్రపతనవారణమును
             వరకళాపరిపూర్ణనస్వతంత్ర
తయు, బాహ్యరతమున దరుణి కళాస్రావ
             ణము, యోనిసంకోచనంబు, యోని