పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఒకనాడు నే సముత్సుకత నానారత్నమండనాల కృతాంగుండ నగుచు
గజరాజుమీఁద సింగారంబు దీపింప వలనొప్ప గూర్చుండి వైభవమున
రాజమార్గమున రారమణియొక్కతె సౌధ మెక్కి చూచి విరాళి నెక్కొనంగ
నీ వభివజ్ఞుఁడవుగా నే డేమిచేసిన నలసటదీరునో తెలియు మనుచు


గీ.

చెప్పి పంపిన యాబోటి చిత్త మెఱిగి ప్రేమ మీరంగ నారాత్రి పిలువనంపి
వచ్చిననుగూడి తనిసిన వనితసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అల మహానవమి లే యద్దాలమేడలోపల పైడితఖ్తుపై కొలువుదీర
నపుడు మంత్రులు బడాఆద్మీలు మొదలుగా చాల సజమ్ముజరాలుజేయ
వరుసగిరీజు సర్వస్సలామని చోపుదార్లు, పరాకంచు తగువిధమున
కటికెముల్ హెచ్చరికల దెల్ప లష్టర్లయందు దీపములు నిండార వెలుఁగ
బల్కచేరీ జేసి బర్ఖాస్తు గావించి ప్రియసతి జేటిచేఁ బిలువనంపి
నగ్నులమై భూషణములూర్చి గద్దెవద్దనె వేడ్కతో నిధువనము సలుప
వెలయ నిర్వంకల నిలువుటద్దములలో నన్యోన్యప్రతిఫలనములచే న
నేకమంచములపై మాకూటముల పరంపరలు జూపట్టిన పరఁగజూసి
యిట్లనేకస్త్రీల కే ననేకాకృతుల్ దాల్చి రాసక్రీడఁ దగ సలిపితి
నింపార మనము నేఁ డిన్నిరూపములుగా నిచ్చోట క్రీడించు టిది విచిత్ర


గీ.

మంచు వెస జెంపలానించి కొంచె మెదురుగాదిరిగి యద్దములలోని గాంచిన ముద్దు
లాడి క్రీడించి తృప్తుల మైనవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

శుకతుండసందష్టసుందరబింబంబు పోలికనున్న కెమ్మోవితోడ
కరరుహపరిలూనకరమర్ధనమ్లానఘనమంజరులు బోలు చనులతోడ
గందేభవిహరణకలుషీకృతిసరోవరాభ్రపుష్పాస్త్రగేహంబుతోడ
భానుమయూఖసంపర్కపరికాంతలలితోపమానగాత్రంబుతోడ
వితతనిశ్వాసమారుతమలినీకృతముకురంబుక్రియ నొప్పు మోముతోడ


గీ.

కాంత సురతాంతశాంతయై కనులు దేలవైచుచు మందసవిన్యస్తబాహుయుగళ
యగుచు దొడలపై బవళించినట్టిహోయలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకవాడు పూవుటిరములోన కెందమ్మి విరులపాన్పున నేను వేడ్క నుండి
కనకాంగి యెల్లలోకములకారు కావించువిధము గాదే నొక్క వింత సేతుఁ