పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆనందమే బ్రహ్మ మనిచెప్పు వాక్య మెన్నగ జారసంఘ మా నందమే నెం
పులుగుకు చీమకు దెలియకుండిగజేతు నెరిగిన హరియొద్ద నెప్పుడుందు,


గీ.

వనుచురిచి దెల్పి దానిమంతికమున కెలమిగొని తేఱ బదియారుకళల బెక్కు
బంధముల సౌఖ్య మొసఁగిన భళిర యనుచు నన్నుదూతిక నటు మెచ్చుకొన్న విధము
మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వెలయాలు దనకూతు నెలమి కన్నెరికంబునకు దోడితేర నే నొకటగూడ
నటు గుండె లదర కవ్యాజసాధ్వస లజ్జలును నాగరంబున మొనసి తొడలు
వెన్కకువంగుట బిగితాకుఁలకు కౌనుతాళియుండుటయు గందర్పసదన
మొగి కన్నెబిగువు లేకుండిన శ్రమయని యేడ్చుచు మ్రొక్కుచు నింకవిడువు
మని తన భావగోపనము సేయగ నేను కళను జాఱగజేసి వలువచేత


గీ.

వీక చెమ్మద్ది యెరు పేమి లేకయున్న యిన్నియును దెల్పి నాతోడ నెందరైరి
చెప్పుమన తెల్లబోయినజూచిన నెలంత నెద దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గ్రామ్యబంధమున నే గలయ నాకౌనుకు తరుణిపాదములు కత్తెర ఘటించి
కడగి చేతులు నాదు మెడకు లంకెలువేయ దానివీపున హస్తతలములల్లి
బల్లిగ బట్టి నే వెసనెత్తి తిరుగుచు గోర్కెతో నడుగడుగునకు దాకు
లమరజేయుచు పెద వందుచు గుచములు వదలక రొమ్మున కదిమికొనుచు


గీ.

రమణితో నాటిరాతిరి రతి యొనర్చి బడల నామేని చెమ్మట దుడిచి చాల
యలసితివిగద యని నాతి యన్నమాట మది దలంప బ్రహ్మానంద మదియుగాదె.


సీ.

మరియొకనాడు సామాన్యపందెము వైచి విపరీతతరమున వినుతిగాంచి
చెలియ, నీకేమి కావలెనన్న, నామాట చెల్లింతునని దాస జేసితేని
యడిగెద ననిన నే నట్లు చేసెదనని బలికిన నింక మావారియింట
నుండనొల్లనటన్న నోహో యదేమన జనని విత్తాశకు జారునొద్ద
కఱగు మీ వని తిట్టు నదిగాక నాయీడుజోడు వారందరు వీడు వచ్చె
వాఁడు వచ్చె నటంచు వట్టిమాటలు బల్కుదురు దాన నీమది గరుణదప్పు


గీ.

గావువ భవద్గృహంబున నే వసింతుననుచు బ్రార్థించి మొక్కిన నట్లొనర్చి
యవిశమున దానితో గూడినట్టిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.