పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

కఠినుడగుబిడ్డ డెందును గలఁడె యనుచు నన్ను గని తాకదాడుచుఁ గన్నుసైగ
జేసి కఱగించి చేసిన చెలిరతులు మది దలంప బ్రహ్మానంద మరిదియకాదె.


ీ.

బిడ్డనొప్పులు గనుపించిన నీసారి గడ తేరుదునో లేదో కలయుమనుచు
ప్రసవించి బురిటిలోపల చూడబోయినఁ జేమార్పులకు నేల చెల్లదనును
జ్వరము వచ్చిన మం దొసంగబోయిన నిది మదనజ్వరము నన్నుఁ కదియుమనును
వ్రతరాత్రు లనుచు నూరకయున్న జూచి నన్గలసిన వ్రతఫల మబ్బుననుచు
కాలంబు గాదని కసరిన వలవల చలమొప్ప నేడ్చుచు జత్తుననుచు


గీ.

యుల్లము గఱంగి తత్కాలయోగ్యములగు పనులు నేచేయ నాసామి యనుచు మొక్కి
ముద్దుగొని సన్నుతించిన ముదితమమత మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

అలిగి కొన్నాళ్ళు నే నటుబోవకుండిన తనగర్భమున నొప్పి దగిలె నింక
నోర్వలే నొడలిలో నుండవు ప్రాణంబులనుచు బిట్టఱచుచు నట్టె దన్ను
కొనుచు నేడ్చుచుండ గుంపునుగూడి నాకడ కొక్కచెలి నంప దడయకదియు
నట్లుచెప్పిన భయ మంది నే జన కడుపొత్తుము నీవన నొత్తవచట
గాదని యట క్రిందుగా జూప నచ్చోటఁ బిసుకంగ నొప్పిచే బిగియబట్టి


గీ.

నటుల గౌగిట జేర్చి యా స్యము నాస్యముంచి యప్పని కొప్పిన నొప్పిపోవు
ననుచు ననుగూడి క్రీడించి పట్టి మమత మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

చిన్నారి యొకనాడు చెలులతో సరసంబు లాడుచు నాయొద్ద కరుదెంచి
యాసీనయై యుండ నప్పుడు నేనొకచెలి గనుగొని నవ్విన గినుక గదుర
పొలతి దిగ్గున లేచి పోవంగ జెయు బట్టి బలిమి బానుపుమీదఁ బడగవైచి
[1]పికిలిపిట్టలరీతి వెస లాగ మేసి నే బిగియించి నవ్వుచు వెలది కోప
మొనరింప జెల్లునే యని యురోజము ముట్టుకొని బాసచేసిన కోప మణగి


గీ.

నొకరినొకరు పెనంగి యొండొరులపైకి మొనసి నిగ్గుచు కాటందుకొనుచు తొలగ
ద్రోయుచు నలసి కలసిన సోయగంబు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

  1. పిగిలిపిట్టలరీతి వెసలాగ లేచి