పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కావున నిప్పుడు.
చ.

సురుచిరఘర్మబిందువులు శ్రోత్రతలమ్ముల గ్రమ్మ సీత్కృతిం
గరము రదచ్ఛదం బదర గందినమోయిలతోడ ధాన్యమున్
గరముల దంపు గ్లాని తమకంబున మానసమైథునంబులన్
వరలు వితంతులన్ దలఁపు దార్చి చరింతురు యోగిబృందముల్.

(కొంచెము నడచి, వినుట నభినయించి చూచి)

ఉ.

కన్నె సమర్తకై విపణికాంతలు చెంతల బూతుపాటలన్
జెన్నగు కంకణాలదర చేతులఁ దట్టుచు బాడుచుండఁగా
విన్న ధరామరుల్ నదికి వే నియమంబుల కేగలేక నా
తిన్నెల నంగవస్త్రతతి దీర్చిరి దొంగముసుంగునిద్రకై.

ఆశ్చర్య మాశ్చర్యము
తే.

వెలసతుల యిట్టిబూతులు వినుచు విటులె
యాత్రపడుచుండగా దూరమందుఁ బోవు
కులసతుల పూకు లూటూరి యలరు తొడల
సందు కోకలు తడిసె నే మందు నింక.

ఇది యిటులుండనిమ్ము. నేను మఱియొకచోటికిం బోయెదను, ఇప్పటికిని కన్నుల గప్పిన చీకఁటి తొలఁగలేదు. ఆహా! ఇచ్చట నింకొక మహోత్సవము కంటఁబడినది.
ఉ.

ఊరికి నేటికి న్నడుమ నున్న లతాగుహలందు చీకఁటిన్
వారిజనేత్ర లంబుహరణంబునకైఁ జని బిందె దించి య
వ్వారినిఁ దానమాడుటకు వచ్చు నభీప్సితవిప్రజారులన్
జీరె మనంబులన్ దనివి సెందె హటాహుటి దెంగులాటలన్.

ఈవింత లిట్లుండుఁగాక! విధవయైన యలాబూస్తని వీధియరుఁగుమీదనే తప్పకఁ గాసరుఁడు పరుండియుండనోపు! అచ్చటకుఁ బోయెద. (అలోచించి) అలాబూస్తని యను నామము దీనికి చాలదు.
మ.

భవనద్వారమునందుఁ బండువుల నొప్పందీర్చు మేల్ మ్రుగ్గులన్
భువిపై నానఁగ వ్రేలుచండ్లు చెఱుపుం బోయంచుఁ బార్శ్వంబులం
దవిపైకిం బిగలాగ బాలకుల నాయంతంబు గావించుటల్