పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/298

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

లంబోదర ప్రహసనము

(ప్రవేశము-జంబుకుఁడు)

జంబు—
చ.

వెలిరతి లోరతమ్ముల నవీన విలాసల నాసగొల్పు రో
వెలఁదుల మేలుబంతి విటవీరుల చేఁ బువుబంతి గృధ్రితో
గలసి నిశీధినిం గడపి కామిని నింటికిఁ బంపినాడ న
గ్నుల నిఁక నిష్టమై గొలువఁగోరెడు నామది సంతసంబునన్.

అప్పుడే తెల్లవారవచ్చుచున్నది. నాసహపాఠకుఁడగు కాసరుని గురువుకొఱకు నదీతీర్థమును దెమ్మని నియోగింతును. ( అంతట కలయజూచి,)
సీ.

నలుదిశిల్ వ్యాపించె నరమూత్రగ్రంధసం
             కలితమౌ చీపురుకట్టదుమ్ము
నదికు న్ముఖం బైరి మదవతుల్ చినిఁగిన
             మైలపక్కలఁ జంక మడతబెట్టి
శోధింపుచుండిరి సాధుసన్యాసులు
             తమ్ముచేఁ గలుగు దంతముల గార
దంపఁజొచ్చిరి శాలిధాన్యంబు విధవలు
             కరములఁ బెద్దరోఁకళ్ల బూని


గీ

అంగణము లూడ్చి శోధింప నావుపేడఁ
బట్టుకొని కొంద ఱతివలు బయనమైరి
కలశములఁ బూని కొందఱు మలవిరేచ