పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కాంత వేడుక నన్ను గనుంగొని నీయట్టి తనయుండు కావలెనని యడిగిన
కడఁగి లోపలి కళికారంధ్రవైపుల్య మది లేక చెమ్మగొడ్రాలి నీచు
వాసన మిగుల రాబరికించి నీకు బిడ్డలు గల్గరన నవ్వెలది రోస
మున ఋతుదినములఁ బురుషులఁ దప్పకగలియుచు నటు కొంతకాలమునకు
మది నాసమాని గ్రమ్మర నన్ను బ్రార్థింప యెముక కర్ణికలోన నునిచి యపుడు


గీ.

శ్రమము నొందించి నాళరంధ్రము సడల్చి పరగమందిచ్చి కూడ గర్భంబు వచ్చి
శిశువుఁ గని నన్ను మెచ్చినచెలియప్రేమ మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

కాముకి ననుజేరి కలయుమటన్న నే నెలమి బాహ్యరతంబు సలిపి తెలిపి
గాఢరతమ్ముకు కాలంబు గాదన్న నదియేమి కారణం బనుచు నడుగ
పొనఁగలో కమలంబు ముకుళించియుండుట యొఱపైన మరుడోల యుబికియుంట
ప్ర్రక్కలు మందమై ద్రవములో చద్దివాసన గల్గియుంట కుచములు కఠిన
తను వహించుటయును గన్మొనల నాఫర్మాని రంగుమీరుట సలిలంబు నోర
నూరుట చప్పని సౌరభం బొరయుట మొదలైనగురుతు లింపొదల జూపి


గీ.

యింతి నీకింక ముట్టురా దిదిమొదలుగ నల్పరతమునఁ దనివొందుమనుచు నట్లు
చేయనను మెచ్చుకొన్న యాచెలువహొయలు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గాఢరతంబున వైపుల్య మందిన నతనుడోలిక చేత నమర బట్టి
పైకి నాకర్షింప ప్రక్కలు గదిపిన బిగివొందనట్లు నీ దగుకరమున
తొలగి సడలకుండ ద్రోసి పట్టుమటంచు సమవిపరీతబంధముల బెనగి
గ్రామ్యబంధమున గలయు మీవని పల్క వాలాయమఱుకాళ్ళు నేలనూది
జఘనంబు వంచి బెల్చనకేల బిగియించి వీ పెత్తి బట్టి బల్ వేడ్క మీఱ


గీ.

గలయుమన నేను జొన్ప మిక్కిలిబిగువుగ యుంట గని మెచ్చుకొన్న యయ్యువతి ఇట్టి
యరిదిసేత లెఱుంగుదే యన్నమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకప్రౌఢకామిని యొక్కనా డొకముద్ద కేమేమొ రుచిదెల్సి యింపుమీఱ
గొనితెచ్చినా ప్రక్కనుంచి హస్తము బట్టుకొని యది చూడంగ కోర్కె మీఱ
మొదల తా ననుఁ గూడి యిది యెంత హాయిగా నున్నదే! యని బాళియొదవజేసి
యంత దా లేచి యయ్యబల వల్దనిన నీవి సడలించి బలిమిచేఁ శయ్యఁ జేర్చి
కదలకుండగబట్టి గవియుమటన్న నేనటుగూడ నొప్పి నొప్పనిన నింక