పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కూడుచు నిల్పి తత్కుచములు చుంబించి మఱిసేయు చేమేమొమాటలకును
బెట్టుచు పగదాని దిట్టుచు కొమ్మ నీసౌందర్య మెంతని సన్నుతింతు
ననుచు నీ యొడలు మెల్లనఁ జూడనిమ్మని యొఱపుగాఁ జూచుచు మరలగూడి
వెడలించి దానిపై బెట్టితిట్టుచు గూడుచును వెన్క కటుదీసి వనజనేత్రి


గీ.

యీఁటెపోటులు గనుమంచు నిట్లులేనివ్యాజముల నిల్పినిల్పగా వలసినట్లు
జేసి చెలి కళ జారజేసినవిధంబు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

చిఱుతప్రాయమున నే నెరతనం బెఱుగక చదురతతోఁగూడ చనువుమీర
నది చెంప గొట్టుచు నటు గోరు బెట్టుచు వెఱపు దెల్పుచు తొడ బెల్లమిడుచు
తఱి యయ్యె విడువంగ దగదని వేడుదు నింతయే? నీశక్తి యింక విడువు
మనుచు దాకరమున నది బట్టి జొన్పుచు గౌగిట బిగియించి గారవించి
మొనపంట నొక్కుచు ముతికొని శ్రమముచే నవమానముల కళ నాగికొనుచు


గీ.

మొనసి యెడనెడఁ బురికొల్చుకొనుచుఁ గూడి సమత నిరువుర కేకకాలముకళలు
జాఱఁజేసినచెలి చమత్కారములను మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మఱియొక్కనాడు నే మక్కువ నొకదాని స్మరశాస్త్రనిగదితస్థానములను
చుంబన మొనరించి శృంగిబేరంబు చుంబనము జేయుచు లోని కొనరనూపి
ఎక్కింప గుర్రని యొక్కనాదము బుట్ట నేనవ్వ సిగ్గుచే నెలఁత లేవ
తొలగితివేఁ మన్న తెలియక ననుమానపడి చీరకొంగున దుడిచి చూడ
నాతమ్ములపురంగు నలుపుగా గనుపింప చెఱగు మాసినదని చెలియ తొలగి


గీ.

శిరమవాంచినతత్వంబు దెలియజెప్పి తల్పమున జేర్చి కూడి యిద్దరము సౌఖ్య
మంది ముదమున నవ్వుకొన్నట్టివిధము మదిదలంప బహ్మానంద మదియకాదె.


సీ.

పడతి నేనును గత వసనుల మైలేచి మారయుద్ధమునకు దారసిల్లి
కలబడి పోరి నే కాల ల్డెమిడి దాని బడద్రోచి పైనెక్క పదముచేత
తొలగఁ ద్రోయుచు నది తోడ్తోడ పైకొని కుదియబట్టిన నేను కొప్పులాగి
పొర్లించి కూడలా పోటు దప్పించుక కాళ్ళు కత్తెరవేసి గరిత ముందు
కొగి నిగ్గి పైకి లేవగ బోవ రొమ్ములబట్టి నే పడద్రోచి పైకి నెక్కి
యదిమిపట్టిన వేగ నదియు నాసిగ బట్టి యీడ్చి చెక్కుల గొట్టి యేపుమీఱ
ప్రక్కకు పొర్లించి పైకెక్కి చేత లింగము బట్టి ననుబాల గాసిపఱచి