పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

గూడి గోలోకమందు గోకులమునందు వేడుకలుమీఱ విధువనక్రీడ సలిపె
నట్టి కృష్ణుని శృంగార మభినుతింప నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

[1]రణము గావింప నొల్లక విషాదంబు నొందిన యర్జునుని నిమిత్తీకరించి
సర్వోపనిషదర్థపాదభూతంబు సద్యోముక్తిదము మహా యెగి వేద్య
మైన గీతాశాస్త్ర మత్యంతకరుణచే కర ముపదేశించు టరయచూడ
భావికాలజనంబు భవబంధములఁ బాసి దోడ్తోడ ముక్తినొందుట గాదె


గీ.

యట్టి కంసారి సృష్టిరక్షాంతకారి భువనహితకారి గోపికామోహకారి
శౌరి లీలావిలాసము ల్సన్నుతింతు నతులమైన బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అంతిమన్మృతి తనయందుఁ గల్గుట జేసి చేదీశ కంస మురాదులకును
సతతంబు భావించు కతన గోపికలకు నల నందునకు యశోదాదులకును
సకలధర్మంబులు చాలించి శరణంబునఁ దిన విజ యెద్ధ వాదులకును
మోక్ష మొసంగుట మొనసి గీతోక్తులు నిజము సేయుటకును విఖిల సమతఁ


గీ.

దవిలి లోకహితార్థమే యవతరించె నుర్వి ననునది తెలియఁజేయుటకుగాదె
యట్టిహరిలీల లన్నియు నభినుతింతు నార్యులార! బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మధురలో నుండి యమ్మాధవుం డొకనాడు వ్రేపల్లెలో నున్న గోపికలను
రాధను యిళనును రతిరహస్యంబులు వారల లీలావిహారములను
రాసోత్సవంబు జలక్రీడలను మఱి వారల నర్మసంభాషణములు
మనమున తలపోసి మమతనిల్పగలేక యేకాంతసీమకు నింపుమెఱయ


గీ.

యుద్ధవుని వేగరావించి యుత్సుకమున నతనితో నెయ్యమునఁ బల్కినట్టిశౌరి
విప్రలంబశృంగారంబు విస్తరింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒనర పిన్నటనాఁటనుండియు నాసోయగము శఠత్వాది భావములు జూచి
ననుఁ గూడి క్రీడింప బనిబూని వనిత లింపొసగ కాత్యాయనీపూజ సలిపి
వరములు వడపి యవ్వల శరద్రజనివనంబులో మద్వేణునాదము విని
పతిసుతాదుల వీడి బాళితో నావద్ద కరుదెంచి యేనీతు లాడ వగలు


గీ.

మీఱ బ్రతుకాసమాని కన్నీరుగార "నిన్ను నమ్మితిమ" న్నమాటెన్నుకొనిన
జాలియగుచున్న దట్టియోషల వలపులు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.

  1. అని సేయనొల్లక నతిదుఃఖమందు నర్జునుని దా హేతుభూతునిగఁ జేసి