పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/149

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కేల వచ్చెను? దాని నేల చూచి విరాళి
            చెందితి?” ననుకొనుఁ జెడితిఁ బడితి
నెవ్వరిఁ బంపుదు? నే రీతి నది వచ్చు?
            నేమి సేయుదు? వైన(దైవ) మిట్లు వెతల.


గీ.

పాలుగాఁ జేసె సాటి నృపాలకోటి
లోన నగుఁబాటు లయ్యెఁ గా లూనరాని
విరహపరితాపభరమున వేఁగఁ దరమె?
యంచుఁ బలవించుఁ దలవంచు నార్తిగాంచు.

90


సీ.

తములంబు తినఁడు బోగమువారి నాడింపఁ
            డన్నంబు కుడువఁడు సన్నవన్నె
కోకలు కట్టఁడు(గల్లఁడు) కొలువుఁ గూర్చుండఁడు
            జలక మాడఁడు గంద మలదు(గంప మలఁచు)కొనఁడు
వేపులతోఁ దాను వేఁటకుఁ బోవఁడు
            నడు(ను)పుకత్తెలఁ గూడి నవ్వుకొనఁడు
వేంకటముఖి యజ్ఞవిధిఁ గనుంగొనఁడు భా
            గవతుల వేషవైఖరులు గనఁడు.


గీ.

కటకటా! చంద్రరేఖావికటకటాక్ష
వీక్షణాక్షీణవాతూలవిజితదేహ
బాలభూరుహుఁ డగుచున్న నీలనృపుఁడు
పరవశత లేచి వనలతాతరులఁ జూచి.

91


క.

కమ్మవిలుకాని తూ పన
నమ్మఖశాలాంగణమున నగపడి చనె నో
యుమ్మెత్తకొమ్మ! నీవా
క్రొమ్మెత్తని మేనిసానికొమ్మం గనవే.

92


క.

వింటివొ లేదో శునకపుఁ
దంటెమువలె బిఱ్ఱబిగిసి తలఁగని వలపుం
గొంటిని గనినది మొదలుగ
తంటెపుమోకా! యి దేమి తబ్బిబ్బో కా?

93